మహబూబాబాద్ మండలం మల్యాల శివారు చిన్న రామోజీ తండాకు చెందిన అనూష, కేసముద్రం మండలం గుడి తండాకు చెందిన సురేశ్‌లు మూడేళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి పేరుతో శారీరకంగా కలిశారు. ఈ క్రమంలోనే అనూష రెండు సార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని అడిగితే వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ మొహం చాటేశాడు.
ఫలితంగా అనూష మహిళా సంఘాల సభ్యులతో కలిసి సురేశ్ ఇంటి ముందు నిరసన చేపట్టింది. సురేశ్‌తో వెంటనే తనకు వివాహం జరిపించి.. న్యాయం చేయాలని వేడుకుంటోంది.