ETV Bharat / jagte-raho

రెప్పపాటులో ఛిద్రమైన బతుకులు... రోడ్డు ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి

author img

By

Published : Jan 22, 2021, 5:14 AM IST

Updated : Jan 22, 2021, 5:26 AM IST

రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు వారు. కుటుంబపోషణ కోసం కాయకష్టం చేసుకునే నిరుపేద బతుకులు వారివి. కూలీ పనులకు వెళ్లనిదే పూట గడవని దుస్థితి. నాలుగు మెతుకుల కోసం నిత్యం పోరాడే శ్రమజీవులను రోడ్డు ప్రమాదం కబళించేసింది. ఆవురావురూమంటూ తనలో కలిపేసుకుంది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో 8 మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

రెప్పపాటులో ఛిద్రమైన బతుకులు... రోడ్డు ప్రమాదంలో 9 మంది కూలీల మృతి

రెప్పపాటులో ఛిద్రమైన బతుకులు...

తనయుడిని కోల్పోయిన తండ్రి... తల్లిదండ్రులేమయ్యారో తెలియని చిన్నారులు... కలకాలం తోడుంటానని మాటిచ్చి అర్ధాంతరంగా కన్నుమూసిన ఇల్లాలు... ఇలా అన్ని రకాల బాంధవ్యాలు కొడిగట్టుకుపోయేలా చేసింది ఒకే ఒక్క ప్రమాదం.

9 మంది...

నల్గొండ జిల్లా పెద్దఆడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ సమీపంలో బొలేరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఘటనాస్థలిలో, ఇద్దరు హైదరాబాద్‌లో, మరొకరు దేవరకొండ ఆస్పత్రిలో తనువు చాలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమించగా... వారికి హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 20 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నాట్లు వేసేందుకు వెళ్లి...

దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు... నాట్లు వేసేందుకు పెద్దఆడిశర్లపల్లి మండలం రంగారెడ్డిగూడానికి ఆటోలో వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని తిరుగు ప్రయాణమైన కాసేపటికే ... మల్లేపల్లి నుంచి సాగర్‌ వైపు వెళ్తున్న కంటైనర్... ఆటోను వేగంగా ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. లారీ అతివేగంగా రావడం, పరిమితికి మించి ఆటోలో కూలీలు ఉండడం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు...

ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్ కొట్టం మల్లేశ్‌తో పాటు ఆయన భార్య చంద్రకళ, తల్లి పెద్దమ్మ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కుమారులను తండ్రి వద్ద వదిలి... భార్య, తల్లితో కలిసి కూలీ పనికి వెళ్లిన మల్లేశ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కట్టుకున్న అర్ధాంగి సహా కొడుకు, కోడలు విగతజీవులుగా మారడం... ఆ వృద్ధ తండ్రి గుడెలవిలసేలా రోదిస్తున్నాడు.

స్థానికంగా పనిచేస్తే రూ. 250, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తే రూ. 400 కూలీ లభిస్తుండడం వల్ల ఆటోలో అంత దూరం వెళ్లినట్లు... ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డవారు చెబుతున్నారు.

ప్రముఖుల దిగ్భ్రాంతి...

నల్గొండ ప్రమాద ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్.... మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి: అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం

Last Updated : Jan 22, 2021, 5:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.