అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరి వ్యక్తుల నుంచి 9.2కిలోల ఎండుగంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలం పెద్దతండా నుంచి వట్పల్లి మండలం సర్కార్ తండాకు వెళ్లే దారిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అటువైపుగా నడుస్తు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.
వారి వద్ద ఉన్న ప్లాస్టిక్ సంచిలో రూ.1.20 లక్షల విలువైన ఎండుగంజాయి దొరికింది. నిందితులను విచారిస్తుండగా ఒకడు పరారయ్యాడు. నారాయణఖేడ్ మండలం వెంకటకిషన్నాయక్తండాకు చెందిన రాఠోడ్ వినోద్ పట్టుబడగా మరో నిందితుడు సర్కార్తండాకు చెందిన పాల్త్యా రాజేష్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సీఎం సమీప బంధువులు కిడ్నాప్.. రక్షించిన పోలీసులు..