వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండల పరిధిలో వలయ రహదారిపై మినీ వ్యాను ఢీకొని 5 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో ఆరు గాయపడ్డాయి. రాంపూర్ గ్రామానికి చెందిన తొట్టె కనకయ్య యాదవ్ గొర్రెలను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తోలుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
వలయ రహదారి వద్ద గొర్రెలు రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపుకు వేగంగా వెళ్తున్న మినీలారి వాటిని ఢీ కొంది. ఈ ప్రమాదంలో తాను సుమారు రూ.50 వేల వరకు నష్టపోయానని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి: వరుణుడు పగబట్టాడా.. మరో భారీ వర్షసూచన