ETV Bharat / jagte-raho

ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి - AP Road Accident News

The wedding van overturned and 6 people died
ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఆరుగురు మృతి
author img

By

Published : Oct 30, 2020, 6:03 AM IST

Updated : Oct 30, 2020, 8:12 AM IST

06:02 October 30

ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి

ఏపీలో పెళ్లివ్యాను బోల్తా పడి ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ ఘాట్‌రోడ్డులో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చోటుచేసుకుంది. పెళ్లికి హాజరై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  బ్రేక్‌ ఫెయిల్‌ కావడం వల్ల వ్యాను కొండపై నుంచి కింద పడింది.

ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను గోకవరం మండలం ఠాకుర్‌పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయ చర్యలు ప్రారంభించారు.

  • మృతులు: కంబాల భాను (గోకవరం), సింహాద్రి ప్రసాద్ (ఠాకూర్ పాలెం), ఎల్లా లక్ష్మీ (దివాన్ చెరువు), ఎల్లా దివ్య శ్రీలక్ష్మి (దివాన్ చెరువు), చాగంటి మోహిని (గాదారాడ), పచ్చకూరి నరసింహ (గంగంపాలెం).

Last Updated : Oct 30, 2020, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.