ETV Bharat / jagte-raho

రత్నదీప్​ సూపర్​ మార్కెట్​పై 5 కేసులు నమోదు

రత్నదీప్‌ సూపర్ మార్కెట్​పై మరోసారి కేసు నమోదైంది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారితో నాయకత్వంలో లీగల్ మెట్రోలజీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. నిబంధనలు పాటించనందుకు 5 కేసులు నమోదు చేసింది.

Hyderabad latest news
Hyderabad latest news
author img

By

Published : May 23, 2020, 6:13 PM IST

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారితో కలిసి జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారులు సోదాలు నిర్వహించారు. రత్నదీప్‌ సూపర్ మార్కెట్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారుల బృందం... నిబంధనలు పాటించనందుకు 5 కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.

కొన్ని రకాల నిత్యావసర సరుకులపై తయారీదారుల సంస్థ పూర్తి వివవరాలు లేకపోవడాన్ని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి వస్తువుపై తయారీదారుడి పూర్తి వివరాలు, తయారీ తేదీ, సంవత్సరం, గడువు తేదీకి సంబంధించిన వివరాలు తప్పక ఉండాలన్నారు. అన్ని వివరాలు ఉన్న వస్తువులను మాత్రమే ప్రజలకు విక్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిత్యావసర సరుకులు విక్రయించినట్లయితే చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారిణి అనురాధ తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.