హైదరాబాద్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. బోయినపల్లిలో ఓ వ్యక్తి గంజాయి తరలిస్తున్నాడనే సమాచారంతో అతడిని పట్టుకోగా ఆ వ్యక్తి వద్ద 2 కిలోల గంజాయి లభ్యమైంది. అతడిని అదువులోకి తీసుకుని విచారించారు. మూడు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల ద్వారా తప్పుడు పత్రాలు చూపించి విశాఖ నుంచి గుర్గావ్కు గంజాయి తరలిస్తున్నట్లు చెప్పాడు.
ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల వద్దకు వెళ్లి విచారించగా 327 కిలోల గంజాయి లభ్యమైనట్లు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేశ్ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి నాలుగు ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఏజేన్సీల వారు సామగ్రిని తరలిస్తున్నప్పుడు పరిశీలించాకే తరలించాలని సూపరింటెండెంట్ చెప్పారు.
ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'