ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం చిన్నమందడి తండాలో చోటుచేసుకుంది. ముడవత్ బాలునాయక్, హీరి దంపతుల కుమారుడు ముడవత్ సిద్ధు (3) కరెంట్ షాక్ గురై మృతి చెందాడు.
అప్పుడే నిర్మించుకుంటున్న ఇంటికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగను బాలు నాయక్ కింద పడేశాడు. అక్కడే ఆడుకుంటున్న సిద్ధు విద్యుత్ బల్బును పెట్టే హోల్డర్లో చేయి పెట్టగా షాక్ తగిలింది. తమ అలసత్వమే కొడుకు ప్రాణం తీసిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చూడండి: కిరాతకం: భర్త మర్మాంగం కోసి.. ఉరి వేసి..