ETV Bharat / jagte-raho

ఐపీఎల్​ బెట్టింగ్​ ముఠా గుట్టు రట్టు... 23 మంది అరెస్ట్​ - ipl bettings in khammam

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గ్రామాల్లో ఐపీఎల్​ బెట్టింగులకు పాల్పడుతున్న 23 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 21 చరవాణులు, సుమారు రూ.55 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

23 members betting gang arrested in penuballi

author img

By

Published : Sep 27, 2020, 10:24 AM IST

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగుకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి, వీయ్యంబంజార, పాత కారాయి గూడెం, అడవిమల్లెల, చింతగూడేనికి చెందిన 23 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్​ తెలిపారు. ఈ నెల 22న పాత కారాయి గూడెం చెందిన శ్రీకాంత్, ఈ నెల 24న చింతగూడెంలో మల్లాది బిక్షాలు, టేకులపల్లిలో వెంకటేశ్వరరావును అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.

నిందితులను విచారించగా... బెట్టింగ్​లకు పాల్పడుతున్న మిగతవారి పేర్లు బయటపెట్టినట్లు తెలిపారు. టేకులపల్లిలో 9 మంది, చింతగూడెంలో ఐదుగురు, పాతకారాయి గూడెం చెందిన ఇద్దరు, అడవిమల్లెల చెందిన ముగ్గురు, వీఎం బంజర్​కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 సెల్​ఫోన్లు, రూ 54,540 ను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు.

యువత క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ సూచించారు. ఈ కేసులో బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్న ఎస్సై నాగరాజు, ఏఎస్సై మన్మధరావు, కానిస్టేబుళ్లను ఏసీపీ అభినందించారు.

ఇదీ చూడండి: దారి దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.