కొబ్బరి మొక్కల చాటున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఏపీ విశాఖ పట్టణం నుంచి ముంబయికి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు.
నిర్మల్ జిల్లా సోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాల్ టోల్‌ప్లాజా వద్ద ఎస్సై ఆసీఫ్ నేతృత్వంలో పోలీసులు వాహనాల తనీఖీలు చేపట్టారు. ఓ కారులో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ఆరాతీశారు. లారీలో కొబ్బరి మొక్కలను అనకాపల్లి నుంచి మహారాష్ట్రలోని జాల్గంకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వారిపై అనుమానంతో వాహనం లోపల తనిఖీ చేశారు. అందులో ఐదు పెద్ద సంచులు, కారులో రెండు పెద్ద సంచుల్లో.. 200 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 24 లక్షల ఉంటుందని అంచనా. ఏడుగురిని అరెస్ట్ చేశారు.
-డీఎస్పీ ఉపేందర్ రెడ్డి
విశాఖలోని అనకాపల్లి ఏజెన్సీలో కొనుగోలు చేసి ముంబయిలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు డీఎస్పీ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. అరెస్టయినవారిలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన అర్మన్ చిందా పటేల్, షేక్ ఆసిఫ్, ఆరీఫ్ సబ్దార్ పటేల్, ముబారక్ ఖాన్, బాగుల్ సతీశ్, మహమ్మద్ మీర్జా, మిలిండ్ సత్యనారాయణ శర్మ ఉన్నట్లు తెలిపారు.