ETV Bharat / jagte-raho

సెల్ఫీ తీసుకుందామని చెరువులోకి దిగి ఇద్దరు యువకులు దుర్మరణం - 2 boys died in shameerpet lake

స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడుపుదామని వెళ్లారు. ఆ సరదాలను ఫొటోల్లో బంధించుకుని దాచుకుందామనుకున్నారు. కానీ... ఆ సంతోష క్షణాలు వారిని తీరని విషాదంలోకి నెట్టేశాయి. సెల్ఫీ తీసుకుందామని చెరువులో దిగిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన మేడ్చల్​ జిల్లా శామీర్​పేట వద్ద చోటు చేసుకుంది.

2 boys died drown in shameerpet lake
2 boys died drown in shameerpet lake
author img

By

Published : Oct 3, 2020, 8:52 AM IST

Updated : Oct 3, 2020, 9:41 AM IST

సెల్ఫీ మోజులో ఇద్దరు యువకులు చెరువులో పడి నిండు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన శామీర్​పేట పెద్ద చెరువు వద్ద చోటు చేసుకుంది. మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం సఫీల్​గూడ ప్రాంతానికి చెందిన ఆరుగురు స్నేహితులు శ్రీధర్, సుమిత్ కుమార్ సింగ్, ఉజ్వల​, మేఘన, మనీశ్​(16), ఉత్తేజ్(16) కలిసి శామీర్​పేట్ కట్ట మైసమ్మను దర్శనం చేసుకున్నారు.

అనంతరం నలుగురు యువకులు ఫొటోలు తీసుకుంటామని చెరువులోకి దిగారు. మనీశ్​, ఉత్తేజ్ ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఉత్తేజ్ మృతదేహం లభ్యం కాగా... మనీశ్​ మృతదేహం కోసం పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: తీసుకున్న డబ్బు ఇవ్వట్లేదని తోటి స్నేహితున్ని హతమార్చారు

Last Updated : Oct 3, 2020, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.