ETV Bharat / jagte-raho

దీపం అంటుకుని 17 నెలల చిన్నారి మృతి - child dead at ponnari village news

తులసి గద్దె వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు గౌనుకు అంటుకుని 17 నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్​ జిల్లా పొన్నారి గ్రామంలో చోటుచేసుకుంది.

17 months old baby dies at ponnari in adilabad district
దీపం అంటుకుని 17 నెలల చిన్నారి మృతి
author img

By

Published : Nov 1, 2020, 8:19 PM IST

ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దీపం అంటుకుని శ్రావణి అనే 17 నెలల చిన్నారి మృత్యువాతపడింది.

గ్రామానికి చెందిన శ్రీకాంత్, పల్లవి దంపతుల కూతురు శ్రావణి శనివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా తులసి గద్దె వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు పాప గౌనుకు అంటుకుంది. ఎవరూ చూడకపోవడం వల్ల ఆ మంటల్లో శ్రావణి పూర్తిగా కాలిపోయింది.

గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని తొలుత రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గ మధ్యలో శ్రావణి మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి.. ఆడియో కలకలం: 15 రోజులకోసారి రూ.5 వేలు ఇవ్వాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.