ETV Bharat / jagte-raho

అడవిలో కోడి పందేలు.. 15 మంది అరెస్టు - మంథన్ గోడ్ శివారులో కోడి పందేలు

సంక్రాంతి పండుగ వచ్చింది.. ఊరికి దూరంగా ఉన్న ప్రాంతం.. కార్లు, బైక్​లతో పలువురు బయలుదేరారు. సంచుల్లో ఉన్న కోళ్లను పందేల కోసం సిద్ధం చేశారు. బయటకి తీసి పందేలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన నారాయణ పేట జిల్లాలో జరిగింది.

15 people arrested for getting indulged in Cock fight at narayanpet district
అడవిలో కోడి పందేలు.. 15 మంది అరెస్టు
author img

By

Published : Jan 14, 2021, 10:07 PM IST

నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్, బుత్పూరు శివారులో కోడి పందేలు కాస్తున్న 15 మంది అరెస్టయ్యారు. ఆ గ్రామల మధ్యలో గల అడవిలో కోడి పందేలు ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న మక్తల్ పోలీసులు దాడులు నిర్వహించారు.

15 మంది పందేం రాయుళ్లు, 17 సెల్​ఫోన్లు, 4 కోళ్లు, 6 బైక్​లు, ఓ కారు, 4,240 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మక్తల్ ఎస్సై రాములు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి : కోడి పందేల్లో యువకుల వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.