తూర్పు టర్కీలో వలసదారులతో ప్రయాణిస్తున్న మినీ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 20 మంది గాయపడినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ 'అనడోలు' తెలిపింది. ఇరాన్ సరిహద్దు ప్రాంతంలోని యుమాక్లి సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో లోయలో పడినట్లు పేర్కొంది.
ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల పౌరులు టర్కీలోని ఇస్తాంబుల్, అంకారా వంటి నగరాలకు వలస వస్తుంటారు. వీరంతా కాలినడకన ఇరాన్ సరిహద్దు ద్వారా టర్కీలోకి అడుగుపెడుతారు. అక్కడి నుంచి మినీ బస్సుల్లో ప్రమాదకరంగా కిక్కిరిసి ప్రయాణిస్తుంటారు.
ఇవీ చదవండి: