ETV Bharat / international

పంజ్​షేర్​కు బీటలు- యుద్ధం ఆపేందుకు సిద్ధం - panjshir afghanistan

తాలిబన్ల కాల్పుల్లో పంజ్​షేర్​ దళాల(Panjshir resistance forces) ప్రతినిధి ఫాహిమ్​ దష్టీ ఆదివారం మృతి చెందినట్లు 'టోలో' తన వార్త కథనంలో వెలువరించింది. మరోవైపు, తాము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని పంజ్​షేర్​ దళాల నాయకుడు అహ్మద్​ మసూద్ తన ఫేస్​బుక్ పోస్ట్​లో తెలిపారు.

Fahim Dashti was killed
కాల్పుల విరమణ
author img

By

Published : Sep 6, 2021, 9:20 AM IST

Updated : Sep 6, 2021, 9:42 AM IST

తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న పంజ్​షేర్​ దళాలకు(Panjshir resistance forces) పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. తాలిబన్ల కాల్పుల్లో పంజ్​షేర్​(Taliban Panjshir దళాల ప్రతినిధి ఫాహిమ్​ దష్టీ ఆదివారం మృతి చెందినట్లు 'టోలో' తన వార్త కథనంలో వెలువరించింది. జమైత్​-ఈ-ఇస్లామీ పార్టీతో పాటు అఫ్గాన్​ జర్నలిస్టుల సమాఖ్యలో దష్టీ సభ్యుడిగా ఉన్నారు. ఈ పరిణామాల అనంతరం పంజ్​షేర్​ ప్రాంతం తాలిబన్ల వశమైందనే అనిపిస్తోంది.

కాల్పుల విరమణకు ఓకే..

తాము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని పంజ్​షేర్​(Panjshir Valley) దళాల నాయకుడు అహ్మద్​ మసూద్ తెలిపారు. తాలిబన్లు తమ ప్రావిన్సును వీడినట్లయితే.. చర్చలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తాలిబన్లతో మొదలైన భేదాభిప్రాయాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. తమ డిమాండ్​ను మానవతా దృక్పథంతో తాలిబన్లు పరిగణలోకి తీసుకుంటారని విశ్వసిస్తున్నట్లు ఫేస్​బుక్​ పోస్ట్​లో తెలిపారు.

పంజ్​షేర్​ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి తాలిబన్లు ఫైటర్లను రంగంలోకి దించారు. ఈ ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చిందని శుక్రవారం ప్రకటించారు. కానీ ఈ ప్రకటనలను పంజ్​షేర్ పోరాట దళాలు ఖండించాయి. ఈ క్రమంలో శనివారం జరిగిన కాల్పుల్లో 700 మంది తాలిబన్ ఫైటర్లను పంజ్​షేర్​ దళాలు మట్టుబెట్టాయని 'స్పుత్నిక్'​ మీడియా తన కథనంలో పేర్కొంది. ఇదే విషయాన్ని పంజ్​షేర్​ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీమ్​ దష్టీ ట్విట్టర్​ వేదికగా తెలిపారని చెప్పింది. కానీ ఫాహిమ్​ దష్టీ మృతి అనంతరం తాజా పరిణామాలు జరిగాయి.

ఏంటీ పంజ్​షేర్​...?

హిందూకుష్‌ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌(panjshir afghanistan) ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్‌ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. గతంలో తాలిబన్ల పాలనను తుదముట్టించడంలోనూ పంజ్​షేర్​ ప్రాంతానిదే కీలక పాత్ర. అక్కడి ప్రజల్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని మరింతగా రగిలించి వారికి మార్గదర్శకత్వం చేసిన వారిలో తాలిబన్‌ వ్యతిరేక నాయకుడు అహ్మద్‌ షా మసూద్‌ కీలక వ్యక్తి. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు.

అయితే తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ 2001 సెప్టెంబర్‌ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో అహ్మద్ షా మసూద్​ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన తనయుడు అహ్మద్​ మసూద్.. తన తండ్రి పోరాట స్ఫూర్తితో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరు సాగిస్తూ వచ్చారు.

ఇదీ చదవండి:Panjshir valley: తాలిబన్లతో పంజ్​షేర్​ సింహం 'రాజీ'!

Taliban Panjshir: తాలిబన్లపై షేర్​ 'పంజా'- 700 మంది హతం!

Last Updated : Sep 6, 2021, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.