ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా అధికారాన్ని చేపట్టిన నాఫ్తాలి బెన్నెట్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలపై వచ్చే ఏడాది 30 ఏళ్ల వేడుక జరుపుకోబోతున్న వేళ ఆయనను కలిసేందుకు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
అటు.. భారత్-ఇజ్రాయెల్‌ల వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై నెతన్యాహు శ్రద్ధ చూపారని మోదీ అన్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో 12ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బెంజిమన్ నెతన్యాహు పాలనకు తెరదించుతూ నూతన ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారాన్ని చేపట్టారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో జరిగిన ఓటింగ్ లో 49 ఏళ్ల బెన్నెట్ కు 60-59 తేడాతో మద్దతు లభించింది.
ఇదీ చదవండి:ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్