ఏటా మార్చ్ 21న 'నౌరోజ్'ను జరుపుకుంటారు కుర్దులు. చీకటి యుగం అంతమై జీవితాల్లో వెలుగు మొదలుకు గుర్తుగా కొత్త ఏడాదిని నిర్వహిస్తారు ఇక్కడి ప్రజలు. అంతేకాకుండా ఈ రోజును స్వేచ్ఛ, స్వతంత్ర పాలనకు చిహ్నంగా కుర్దులు భావిస్తారు.
మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు 3 కోట్ల మంది కుర్దులు జీవిస్తున్నారు. ఇరాన్, ఇరాక్, టర్కీ, సిరియా దేశాల్లో వీరు నివసిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాక్‌లోనే ఆనందంగా వేడుకలు చేసుకుంటున్నారు. ఇదే రోజున పర్షియన్ సంవత్సరాదిగా ఇరాన్ ప్రజలు జరుపుకుంటారు.
ఇదీ చూడండి:టమోటాలతో హోలీ... ఎంతో బాగుంటుందో మరి