ETV Bharat / international

అఫ్గాన్​లో పాక్ ఉగ్రసంస్థ అధినేత హతం! - లష్కరే ఇస్లామ్

పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాద సంస్థ అధినేత మంగల్​ బాఘ్​ అఫ్గానిస్థాన్​లో జరిగిన బాంబు పేలుడులో హతమయ్యాడు. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్​ స్పష్టం చేశారు. అయితే.. మంగల్​ బాఘ్​ మృతిపై ఇదివరకు కూడా అనేక వార్తలు వచ్చాయి.

pak terrorist, afganistan
అఫ్గాన్​లో పాక్​ ఉగ్రవాది హతం
author img

By

Published : Jan 29, 2021, 11:16 AM IST

పాకిస్థాన్​ ఉగ్రవాద సంస్థ లష్కరే ఈ ఇస్లామ్​ అధినేత మంగల్ బాఘ్ హతమయ్యాడు. అఫ్గానిస్థాన్​ అచిన్ జిల్లా బండారీ​ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన పేలుడులో మృతి చెందినట్లు ఆ ప్రాంత గవర్నర్ జియాఉల్హక్​ అమర్ఖిల్​ ట్వీట్​ చేశారు. మంగల్​ బాఘ్​ సహా మరో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు చెప్పారు.

నిజంగా చనిపోయాడా?

తెహ్రికే తాలిబన్​ పాకిస్థాన్​ అనే తీవ్రవాద సంస్థతో కలిసి పనిచేసే మంగల్​ బాఘ్​పై అమెరికా ఇప్పటికే 21.8 కోట్ల నజరానా ప్రకటించింది. మంగల్​ హతమైనట్లు గతంలోనూ అనేక సార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

మంగల్​కు మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా, కిడ్నప్​, నాటో కాన్వాయ్​లపై దాడులు, సరకు రవాణాపై డబ్బు వసూలు చేయడం ద్వారా ఆదాయం పొందుతున్నట్లు తెలిపింది అమెరికా.2006 నుంచి లష్కరే ఈ -ఇస్లామ్​ అనే ఉగ్రసంస్థను నడుపుతున్నాడని, తన ఆదాయ మార్గాలకు ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు తన భాగస్వామ్య సంస్థలను మార్చుతున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి : 'ఒబామా కేర్'​ మళ్లీ ప్రారంభం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.