ఇజ్రాయెల్, యూఏఈ మధ్య సంబంధాల పునరుద్ధరణ దిశగా మరో ముందడుగు పడింది. యూఏఈలో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ప్రస్తుతం తాత్కాలిక కేంద్రంలో ఏర్పాటు చేసిన రాయబార కార్యాలయాన్ని.. త్వరలోనే శాశ్వత ప్రాంతానికి తరలించనున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత విస్తృతపరిచేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గబి అష్కెనాజి పేర్కొన్నారు.
త్వరలో మొరాకోతో పాటు, దుబాయ్‌లో రాయబార కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది. బహ్రెయిన్‌లో ఇప్పటికే తమ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.
యూఏఈ సైతం
మరోవైపు, యూఏఈ సైతం ఇజ్రాయెల్‌లో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రాజధాని టెల్ అవివ్‌లో ఎంబసీని నెలకొల్పాలని యూఏఈ ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని గల్ఫ్ న్యూస్ తెలిపింది.
పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని గతేడాది ఆగస్టులో ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో తొలిసారి ఓ అరబ్ దేశం ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.
ఇదీ చదవండి: