ETV Bharat / international

పండుగ రోజూ ప్రశాంతంగా లేని గాజా - ఇజ్రాయెల్​ పాలస్తీనాల మధ్య ఈజిప్ట్

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఘర్షణలు రంజాన్‌ పండుగ రోజూ కొనసాగాయి. హమాస్‌తో ఘర్షణ తీవ్రం కావడం వల్ల ఇజ్రాయెల్‌ 9 వేల మంది సైనికులను గాజా సరిహద్దుల్లో మోహరించింది. ఇప్పటివరకు కొనసాగిన రాకెట్‌ దాడులు, వైమానిక దాడుల నుంచి ఘర్షణలు భూభాగానికీ పాకే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఘర్షణలోకి లెబనాన్‌ ప్రవేశించగా.. విపరీత పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఘర్షణలు నిలువరించడానికి ఈజిప్ట్‌ మధ్యవర్తిత్వం విఫలమైంది.

israel
గాజా
author img

By

Published : May 14, 2021, 9:00 PM IST

Updated : May 14, 2021, 9:15 PM IST

ఈజిప్ట్‌ మధ్యవర్తిత్వం విఫలం కావటం వల్ల... ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రంజాన్‌ పండుగ రోజు కుటుంబ సమావేశాలు, పండుగ విందులకు బదులుగా.. గాజావీధులు నిర్మానుష్యంగా మారాయి. హమాస్‌తో మొదలైన ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ 9 వేల మంది సైనికులను గాజా సరిహద్దుల్లో మోహరించింది. ఇప్పటివరకు పాలస్తీనా ఉగ్రవాదులు 18 వందలకుపైగా రాకెట్లను ప్రయోగించగా... అందులో 4 వందలకుపైగా లక్ష్యాలకు దూరంగా తాకినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రకటించింది.

పరస్పర దాడులతో..

ఇజ్రాయెల్‌ జరిపిన 600కుపైగా వైమానిక దాడుల్లో మూడు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. పరస్పరం దాడులతో గాజా పట్టణంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సరిహద్దుల్లో మోహరించిన యుద్ధ ట్యాంకులు 50 రౌండ్ల దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. సొరంగాల్లో తలదాచుకున్న హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. బహుళ అంతస్తుల భవనాలపై వైమానిక దాడులకు ముందు పౌరులను ఖాళీ చేయించే పరిస్థితి ఇప్పుడు లేదని ఇజ్రాయెల్‌ సైనికాధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌ దాడులు ఉద్ధృతం కావటం వల్ల పాలస్తీనా ప్రజలు గాజా పట్టణంలోని సమీప ప్రాంతాల్లో తలదాచుకునేందుకు పిల్లాజెల్లాతో వెళ్లిపోతున్నారు.

ఇదీ చూడండి: అసలే కరోనా.. ఆపై బాంబుల మోత

మారణహోమం..

ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 119 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వారిలో 31 మంది చిన్నారులు, 9 మంది మహిళలు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. 830 మందికిపైగా గాయపడినట్లు తెలిపింది. 20మంది తమ సభ్యులు చనిపోయినట్లు హమాస్‌, ఇస్లామిక్‌ జిహాదీ మిలిటెంట్‌ గ్రూప్‌లు ప్రకటించుకున్నాయి. ఇజ్రాయెల్‌ మాత్రం ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సైనికుడు, బాలుడితోపాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులతో దక్షిణ ఇజ్రాయెల్‌లో జనజీవనం స్తంభించింది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ నగరంతోపాటు బ్యారేజీలే లక్ష్యంగా హమాస్‌ రాకెట్‌ దాడులు నిర్వహించింది. దక్షిణ ఇజ్రాయెల్‌ లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన రాకెట్‌ అయ్యాస్‌ను ప్రయోగించింది. అయితే అది ఎడారి ప్రదేశంలో పడింది. ఈ దాడితో రామెన్‌ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. హమాస్‌ రెండు డ్రోన్లను ప్రయోగించగా.. ఇజ్రాయెల్‌ వాటిని కూల్చేసింది.

ఇదీ చూడండి: మసీదుపై బాంబు దాడి- 12 మంది మృతి

ఈజీప్టు మధ్యవర్తిత్వం..

అంతర్జాతీయ సమాజం తరఫున మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఈజిప్ట్‌ రంగంలోకి దిగింది. ఈజిప్ట్‌ అధికారులు తొలుత గాజాలో హమాస్‌ నేతలను కలిసి చర్చలు జరిపారు. ఆ తర్వాత టెల్‌ అవీవ్‌కు వెళ్లి ఇజ్రాయెల్‌ నేతలతోనూ భేటీ అయ్యారు. ఇరువైపుల నుంచి సంధి యత్నాలకు సానుకూల స్పందన రాలేదని సమాచారం. మరోవైపు మూడు రోజులుగా గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో అమాయక ప్రజలు చనిపోవటం వల్ల ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది. అందుకు హమాసే కారణమని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. జనావాసాల మధ్య హమాస్‌ మిలిటరీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం సహా అక్కడి నుంచి దాడులు చేయడమే కారణమని ఇజ్రాయెల్‌ పేర్కొంది. దాడుల విషయంలో వెనకడుగు లేదని హమాస్‌ తేల్చేసింది. గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్‌ 9 వేల మంది సైనికులను మోహరించటంపై స్పందించిన హమాస్‌ సైనికాధికారి.. భూభాగ యుద్ధానికి తామేమి భయపడటం లేదన్నారు.

ఇస్లాం దేశాలు ఏకమవుతున్నాయా?

ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య ఘర్షణలోకి లెబనాన్‌ ప్రవేశించినట్లు సమాచారం. ఇదే నిజమైతే.. ఈ ఘర్షణలు విపరీత పరిస్థితులకు దారితీసే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. దక్షిణ లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ వైపు నిన్న సాయంత్రం మూడు రాకెట్లు దూసుకొచ్చినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇదే జరిగితే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ పిలుపునిచ్చినట్లు ఇస్లాం దేశాలు ఏకమవుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ఈ ఘర్షణలను ఉద్దేశించి ఎర్డోగన్‌ ఓ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు మద్దతుగా నిలవకపోతే.. ఇస్లాం దేశాలన్నింటికీ ప్రమాదం పొంచి ఉందని జోస్యం చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మద్దతు కోరే ప్రయత్నం చేయగా ఐరాస సూచించిన సయోధ్యకు తాము మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించి పుతిన్‌ దౌత్యనీతి చాటారు.

ఇదీ చూడండి: రాజీ యత్నాలు.. రాకెట్​ దాడులు

Last Updated : May 14, 2021, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.