కువైట్‌లో భారత్‌కు చెందిన దంత వైద్య నిపుణుడు డా. వాసుదేవరావు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అక్కడి వార్తా సంస్థ తెలిపింది. వైరస్‌తో కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించింది. దీంతో కువైట్‌లో కరోనాతో ఇప్పటి వరకు ఇద్దరు వైద్యులు మరణించారు.
రావు మృతికి సంతాపం
ప్రభుత్వరంగ సంస్థ అయిన కువైట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన కువైట్ ఆయిల్ కంపెనీలో.. దంత వైద్యునిగా విధులు నిర్వహిస్తున్నారు రావు. ఆయన 15ఏళ్లుగా అక్కడే నివాసముంటున్నట్టు తెలుస్తోంది. కువైట్‌లోని భారతీయ దంత నిపుణుల సంస్థ అయిన ఇండియన్ డెంటిస్ట్స్ అలయన్స్‌లో సభ్యుడిగా కూడా ఉన్నారు వాసుదేవరావు. ఆయన మృతి పట్ల సంస్థ సంతాపం తెలిపింది.
తొలి వైద్యుడు
ఈజిప్ట్‌కు చెందిన చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) నిపుణులు తారెక్ హుస్సేన్ మొఖైమర్... కరోనాతో మరణించిన తొలివైద్యుడిగా గల్ఫ్ వార్తా సంస్థ నివేదించింది. ఆయన 20 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నారు.
కువైట్ నుంచి భారత్‌కు 171మంది
వైరస్ విస్తరిస్తున్న దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు "వందే భారత్" మిషన్‌ను చేపట్టింది భారత ప్రభుత్వం దీనిలో భాగంగా కువైట్ నుంచి చెన్నైకు 171మంది భారతీయులను తీసుకొచ్చింది.
కువైట్‌లో 8,688మంది వైరస్ బారిన పడగా 58మంది మృతి చెందారు.
ఇదీ చూడండి: మగవారిలో కరోనా ఇందుకే ఎక్కువట!