ఇరాన్ గగనతలం మీదుగా విమానాలు నడపొద్దని ఈయూ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ (ఈసా) ఎయిర్‌లైన్ సంస్థలకు సూచించింది. ఉక్రెయిన్ విమానాన్ని టెహ్రాన్ సమీపంలో ఇటీవల ఇరాన్ భద్రతా దళాలు పొరపాటున కూల్చిన నేపథ్యంలో ఈ సూచనలు చేసింది. ఇరాన్ సైన్యం పొరపాటున కూల్చిన ఈ విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 176 మంది ప్రాణాలు కోల్పోయారు.
"అందుబాటులో ఉన్న పూర్తి సమాచారం మేరకు.. ఇరాన్ గగనతలం మీద అన్ని ఎత్తుల్లో విమాన ప్రయణాలు నిషేధించాలని సూచిస్తున్నాం. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ ఆదేశాలు పాటించాలని ఆదేశిస్తున్నాం." -ఈసా ప్రకటన
ఇదిలా ఉండగా.. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చర్యలు తీసుకోవాలని తమ భద్రతా దళాలను ఆదేశించారు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ కామేని. ఈ విషయంపై ఇరాన్ స్వతంత్ర, పారదర్శకమైన దర్యాప్తు చేయాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేస్తోంది.
ఇదీ చూడండి:'ఇరాన్ జవాబుదారీతనంగా ఉండాలి'