ETV Bharat / international

ఉగ్ర ఉన్మాదానికి పాక్‌ ఊతం: ఉపరాష్ట్రపతి వెంకయ్య

అజర్ బైజాన్ బాఖులో జరిగిన​ అలీనోద్యమ దేశాల సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ నిప్పులు చెరిగారు. వాతావరణ మార్పులు, వ్యాధులు, ఆర్థిక సంక్షోభాలు, సైబర్‌ నేరాలు ఎడాపెడా విస్తరిస్తున్న నేపథ్యంలో అలీన దేశాలన్నీ నిర్మాణాత్మక చర్యలతో ముందడుగేయాలన్నారు.

ఉగ్ర ఉన్మాదానికి పాక్‌ ఊతం..నిప్పులు చెరిగిన వెంకయ్య
author img

By

Published : Oct 26, 2019, 7:04 AM IST

Updated : Oct 26, 2019, 7:52 AM IST

పాక్‌ ఉగ్ర ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం నిప్పులు చెరిగారు. ఇక్కడ జరిగిన 18వ అలీనోద్యమ దేశాల సదస్సులో మాట్లాడుతూ పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. భారతదేశంలో అస్థిరతను, అశాంతిని రెచ్చగొట్టేందుకు కుటిల యత్నాలు చేస్తోందన్నారు. సమకాలీన ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు... బాన్‌డుంగ్‌(ఇండోనేషియా) సూత్రాల అమలు నేపథ్యంపై ఆయన మాట్లాడారు. ఉగ్రవాద ఉన్మాదం, వాతావరణ మార్పులు, వ్యాధులు, ఆర్థిక సంక్షోభాలు, సైబర్‌ నేరాలు ఎడాపెడా విస్తరిస్తున్న నేపథ్యంలో అలీన దేశాలన్నీ నిర్మాణాత్మక చర్యలతో ముందడుగేయాలన్నారు.

మా పొరుగుదేశం తీరు చూడండి!

ఈ సదస్సులో అన్ని దేశాలు అభివృద్ధి, పరస్పర సహకారంపై మాట్లాడుతుంటే ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న పాకిస్థాన్‌ మాత్రం తన చర్యలను సమర్థించుకుంటున్న తీరును యావత్‌ ప్రపంచం గమనించాలని వెంకయ్యనాయుడు కోరారు. ఉగ్రసంస్థలు సమకూర్చుకుంటున్న సైబర్‌ సాంకేతిక సామర్థ్యం మన సమాచార సాంకేతికతకే పెనుముప్పుగా పరిణమించిందన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత చట్టాలను మరింత పటిష్ఠం చేయడం, నిఘా బృందాల సమన్వయంపై 1996లో భారత్‌ చేసిన ప్రతిపాదనలను అనుసరించాలని కోరారు. శాంతి, అభివృద్ధి శక్తులతో కలిసి అలీనోద్యమం ముందుకు సాగే ప్రయత్నం చేయాలంటూ 130 కోట్ల భారతీయుల తరఫున కోరుతున్నామన్నారు. దురాక్రమణలకూ దూరంగా ఉండటం.. సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవడం, పరాయి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి 1955 నాటి బాన్‌డుంగ్‌ సదస్సు సూత్రాలు నేటికీ అనుసరణీయమేనన్నారు. అలీనోద్యమంలో భారతదేశం సర్వదా సమర్థ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ జనాభా ఎదుర్కొంటున్న విద్య, ఆరోగ్య, నిరుద్యోగ సంబంధ సమస్యలకు సత్వర పరిష్కారాలను అన్వేషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సదస్సు ప్రారంభానికి ముందు వియత్నాం ఉపాధ్యక్షురాలు డామ్‌ థీ ఎన్‌గోక్‌, క్యూబా ఉపాధ్యక్షుడు మిగుల్‌ బెర్ముడేజ్‌తో, అనంతరం అఫ్గాన్‌ ప్రతినిధులతో వెంకయ్యనాయుడు సారథ్యంలోని భారత బృందం ద్వైపాక్షిక చర్చలు జరిపింది.

ప్రవాసులకు దీపావళి శుభాకాంక్షలు

దేశ సమగ్ర, సుస్థిరాభివృద్ధిలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. బాఖులో శుక్రవారం ప్రవాస భారతీయులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ దేశ ప్రగతిలో యువత, ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రవాస భారతీయుల భాగస్వామ్యమూ కీలకమన్నారు. భారత జాతిపిత 150వ జయంతిని పురస్కరించుకొని అజర్‌బైజాన్‌ ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేయడాన్ని ఆయన ప్రశంసించారు. ప్రవాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: హరియాణాలో కమలమే..మహారాష్ట్రలో ఉత్కంఠ!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
SOTHEBY'S - AP CLIENTS ONLY
London - 24 October 2019
1. STILL of auctioneer conducting auction for bottle of The Macallan 60 Year Old 1926 whisky
2. STILL of bottle of The Macallan 60 Year Old 1926 whisky
3. STILL of bottle of Brora 40 Year Old 1972 Vintage whisky
4. STILL of bottle of Bowmore 1957 whisky
5. STILL of bottle of Dalmore Eos whisky
6. STILL of display cabinet with collection of whisky bottles
7. STILL of display cabinet with collection of whisky bottles
STORYLINE:
A single bottle whisky sold at auction for a record £1.5 million (1.9 million US dollars) at Sotheby's auction house in London on Thursday.
The bottle of The Macallan 60 Year Old 1926 had been estimated to sell for between £350-thousand (449-thousand US dollars)  and £450-thousand (577-thousand US dollars).
It is described as the "holy grail" of whisky and was part of a collection of Scotch whisky which was the most valuable to be offered at auction.
The previous auction record for a single bottle was £1.2 million (1.5 million US dollars), set by another bottle of The Macallan 60 Year Old 1926 drawn from the same cask, but presented in a unique bottle painted by the Irish artist Michael Dillon.
It sold at a London auction in November last year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 26, 2019, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.