ETV Bharat / international

Taliban News: క్రూరత్వానికి మారుపేరు.. ఎవరీ తాలిబన్లు? - తాలిబన్​ వార్తలు

అఫ్గానిస్థాన్‌లో మళ్లీ తాలిబన్‌ శకం మొదలుకావడం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పాశవికతకు మారుపేరుగా నిలిచిన ఈ ముఠా ఎలాంటి అకృత్యాలకు పాల్పడుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మధ్యరాతి యుగం నాటి సూత్రాలను నమ్మిన తాలిబన్‌ల ప్రస్థానాన్ని ఓసారి పరికిస్తే..

taliban news
అఫ్గానిస్థాన్‌ వార్తలు
author img

By

Published : Aug 16, 2021, 7:45 AM IST

Updated : Aug 16, 2021, 9:01 AM IST

పష్టో భాషలో తాలిబన్‌ అంటే విద్యార్థి అని అర్థం. 1990లలో అఫ్గానిస్థాన్‌లో సోవియట్‌ సేనలపై పోరాడిన వివిధ ముజాహిదీన్‌ వర్గాలు.. రష్యా నిష్క్రమణ తరవాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ముజాహిదీన్‌ నాయకులు పాలన గురించి పట్టించుకోకుండా నిరంతరం కలహాల్లో మునిగి తేలేవారు. జనంపై విపరీతంగా పన్నులు వేసేవారు, డబ్బు కోసం కిడ్నాప్‌లకు తెగబడేవారు. దీంతో దేశమంతటా అరాచకం తాండవించింది. ఈ నేపథ్యంలో 1994లో తాలిబన్లు ముల్లా ఒమర్‌ నాయకత్వంలో దేశంలో సుస్థిరతను నెలకొల్పడానికి రంగంలోకి దిగారు. సౌదీ అరేబియా నిధులతో ఉత్తర పాకిస్థాన్‌లో నిర్వహించిన ఇస్లామిక్‌ విద్యాలయాల్లో వీరు చదువుకునేవారు. వ్యవస్థాపక సభ్యులంతా ఒమర్‌ విద్యార్థులే కావడం వల్ల.. ఆ ముఠాకు తాలిబన్‌ అని పేరు పెట్టారు. తాలిబన్‌ ముఠాలో తొలుత ముజాహిదీన్‌ ఫైటర్లు ఉండేవారు. పాకిస్థాన్‌ సైన్యం, సైనిక గూఢచారి సంస్థ ఐఎస్‌ఐల అండదండలతో తాలిబన్లు అఫ్గాన్‌ ముజాహిదీన్‌ వర్గాలను ఓడించి 1998కల్లా దేశాన్ని చాలావరకూ తమ ఏలుబడిలోకి తెచ్చుకుని శాంతిభద్రతలను పునరుద్ధరించారు. చిరకాలంపాటు యుద్ధ సంక్షోభంలో నానా అగచాట్లు పడిన అఫ్గాన్‌ ప్రజలకు అది గొప్ప ఊరట అనిపించింది. ప్రారంభంలో ఈ ముఠాకు మంచి ఆదరణ లభించింది. నేరాలు, అవినీతిని అరికడతామన్న హామీ వారికి సాంత్వన కలిగించింది.

ఆటవిక పాలన..

పాలనలోకి వచ్చాక తాలిబన్ల నిజస్వరూపాన్ని చాటారు. ఇస్లామిక్‌ పాలన పేరిట కఠిన షరియా చట్టాన్ని అమలు చేశారు. హంతకులను, అక్రమ సంబంధానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న స్త్రీ, పురుషులను బహిరంగంగా తలలు నరకడం లేదా ఉరితీయడం, చోరీలకు పాల్పడినవారి చేతులు నరకడం వంటి మధ్యయుగాల నాటి శిక్షలు అమలు చేశారు. పురుషులు గడ్డాలు పెంచాలనీ, స్త్రీలు తప్పనిసరిగా బురఖాలు ధరించాలనీ ఆదేశించారు. 10 ఏళ్లు పైబడిన బాలికలు పాఠశాలలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. సంగీతం, టీవీ, సినిమాలనూ నిషేధించారు. పరమత సహనానికి వారి నిఘంటువులోనే స్థానం లేకుండా పోయింది. 2001లో బామియాన్‌ బుద్ధ విగ్రహాలను ఫిరంగులతో పేల్చేయడమే దీనికి నిదర్శనం. తాలిబన్లకు పుట్టినిల్లు పాకిస్థాన్‌.. ఈ వాస్తవాన్ని పాక్‌ నాయకులు నిరాకరిస్తున్నా, తాలిబన్‌ తొలి తరం నాయకులు పాక్‌ మదర్సాల్లోనే చదివారనేది సత్యం. ఒక దశలో తాలిబన్లు పాకిస్థాన్‌లోనూ అస్థిరత సృష్టించారు. పెషావర్‌లో ఒక పాఠశాలపై దాడిచేసి విద్యార్థులను ఊచకోత కోశారు. అప్పటి నుంచి పాక్‌లో వారి ప్రాబల్యం క్షీణించింది.

సెప్టెంబరు 11 దాడులతో మలుపు

అమెరికాపై 2001 సెప్టెంబరు 11న ఉగ్రదాడికి పాల్పడిన అల్‌ ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ అఫ్గానిస్థాన్‌లో స్థావరం ఏర్పరచుకున్నాడని అమెరికా తేల్చింది. అతడిని తమకు అప్పగించాలని తాలిబన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. దీనికి ఆ ముఠా అంగీకరించలేదు. దాంతో 2001 అక్టోబరు నుంచి అమెరికా, నాటో సేనలు దాడులు ప్రారంభించి తాలిబన్లను కూలదోశాయి. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాయి.

ఒప్పందానికి తిలోదకాలు

తాలిబన్లు వరుస దాడులు చేస్తూ పౌర ప్రభుత్వాలను బలహీనపరిచారు. చివరకు ఈ యుద్ధంపై ఖర్చు అమెరికాకు తలకు మించిన భారమై అక్కడి నుంచి నిష్క్రమించదలిచింది. అందుకే 2020 ఫిబ్రవరిలో తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం తాలిబన్లు అఫ్గాన్‌ ప్రజాస్వామ్య ప్రభుత్వంతో అధికారం పంచుకోవాలి. ఒప్పందంతో తమ పని పూర్తయిందంటూ అమెరికా సేనలు హడావుడిగా అఫ్గాన్‌ నుంచి వైదొలగడం ప్రారంభించాయి. తాలిబన్లు మాత్రం ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కి దేశమంతటినీ తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి అఫ్గాన్‌ ప్రభుత్వంపై పోరు ప్రారంభించారు. రాజధాని కాబుల్‌ స్వాధీనంతో వారి లక్ష్యం నెరవేరింది.

అఫ్గాన్‌ భద్రతా దళాలు ఏమయ్యాయి?

అఫ్గాన్‌ భద్రత పద్దు కింద అమెరికా 88 బిలియన్‌ డాలర్లకుపైగా ఖర్చు పెట్టింది. అఫ్గాన్‌ జాతీయ భద్రత, రక్షణ దళాల (ఏఎన్‌డీఎస్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేసి, ఆధునిక ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది. తాలిబన్‌ సేనతో పోలిస్తే వీరి వద్ద మెరుగైన సాధన సంపత్తి ఉంది. రికార్డుల ప్రకారం చూస్తే వీరి సంఖ్య కూడా ఎక్కువే. అయినా ఓటమి తప్పలేదు. అఫ్గాన్‌ జాతీయ భద్రత, రక్షణ దళాలు (ఏఎన్‌డీఎస్‌ఎఫ్‌)లో 3 లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో సైన్యం, పోలీసులు ఉన్నారు. వీరిలో పోరాడే సైనికుల సంఖ్య 1.8 లక్షల మేర ఉండొచ్చని అంచనా. నకిలీ పేర్లతో సైనికుల రికార్డులు సృష్టించి, వారి పేరు మీద జీతాలను అవినీతి అధికారులు దిగమింగుతున్నారు. దీంతో సైనిక బలానికి సంబంధించి అధికారిక లెక్కకు వాస్తవ సంఖ్యకు మధ్య చాలా వ్యత్యాసం ఏర్పడింది. అఫ్గాన్‌ సైనికుల నైతిక స్థయిర్యం, పోరాట స్ఫూర్తి అంతంతమాత్రమే. ఈ సేనలో సంస్థాగత బలం, సంఘటిత శక్తిగా పనిచేసే తత్వం లోపించింది. తాజా పోరులో తమకు సరకుల సరఫరా కూడా సరిగా లేదని సైనికులు ఆరోపిస్తున్నారు. ఆహారం కోసం అలమటించాల్సి వచ్చిందని వాపోయారు.

మరోవైపు తాలిబన్లలో దాదాపు 2లక్షల మంది ఫైటర్లు ఉండొచ్చని అమెరికా సైనిక సంస్థల అంచనా. స్థానిక ముఠాలు, మద్దతుదారులు 90వేల మంది వీరికి సాయంగా నిలిచినట్లు విశ్లేషిస్తున్నారు. తాలిబన్లకు పాక్‌తోపాటు చైనా, రష్యాలు ఆయుధాలు సరఫరా చేసినట్లు భావిస్తున్నారు. వీటికితోడు పలాయనం చిత్తగించిన అఫ్గాన్‌ సైనికుల ఆయుధాలను చేజిక్కించుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక పెద్దలు మధ్యవర్తిత్వం వహించి, అఫ్గాన్‌ సైనికులు వెనుదిరిగేలా చేశారన్న వార్తలు వచ్చాయి.

ఇదీ చదవండి:దేశాన్ని​ వీడిన అఫ్గాన్​ అధ్యక్షుడు ఘనీ!

ప్రజా పాలనకు అంతం- తాలిబన్ల కబంధ హస్తాల్లోకి అఫ్గాన్​!

'ఇస్లామిక్​ ఎమిరేట్​ ఆఫ్​ అఫ్గానిస్థాన్'​గా ప్రకటిస్తాం'

Last Updated : Aug 16, 2021, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.