లెబనాన్ రాజధాని బీరుట్‌లోని బాబ్దా జైలును శనివారం దాదాపు 70మంది క్రిమినల్స్ ధ్వంసం చేసి పరారయ్యారు. ఐదుగురు ఖైదీలు ఓ కారును దొంగిలించి అందులో తప్పించుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వారి కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు నేరస్థులు అక్కడికక్కడే మరణించారు. పరారైనవారిలో ఇప్పటివరకు 15మందిని మళ్లీ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరో నలుగురు లొంగిపోయారని వివరించారు.
జైలు సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు భద్రతాబలగాలు తెలిపాయి. సమీప ప్రాంతాన్ని సీల్ చేసినట్లు వివరించాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.