ETV Bharat / international

Yemen news: యెమెన్​లో క్షిపణి దాడులు- 44 మంది మృతి

యెమెన్​లో (Yemen news) ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన దాడుల్లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.

Yemen news
యెమెన్​ దాడులు
author img

By

Published : Sep 27, 2021, 1:31 PM IST

యెమెన్​లో తిరుగుబాటుదారులు, ప్రభుత్వ మద్దతుదారులకు జరిగిన భీకర ఘర్షణల్లో(Yemen news) 44 మంది ప్రాణాలు కోల్పోయారు. చమురు నిల్వలకు ప్రసిద్ధి చెందిన దక్షిణ రాష్ట్రం మారిబ్​లో జరిగిన దాడుల్లో 28 మంది తిరుగుబాటుదారులు మృతి చెందగా.. ప్రభుత్వ మద్దతుదారులు 16 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ నియంత్రణలో పలు ప్రాంతాలపై రెబల్స్.. డ్రోన్లు, క్షిపణి దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. అందుకు దీటుగా హౌతీ నియంత్రణలో ఉన్న ప్రాంతాలు, మారిబ్ పశ్చిమ భాగంలో ఉన్న తిరుగుబాటుదారులే లక్ష్యంగా ప్రభుత్వ బలగాలు వైమానిక దాడులను నిర్వహించారని పేర్కొన్నారు.

దాడులు ఎందుకు?

2014లో ఇరాన్​ మద్దతుతో హౌతీలు (Yemen News) రాజధాని సనాను చేజిక్కించుకున్నప్పటి నుంచి యెమెన్​లో అంతర్యుద్ధం (Yemen Civil War) మొదలైంది. దేశంలోని ఉత్తర భాగాన్ని హౌతీలు హస్తగతం చేసుకున్నారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం తొలుత దక్షిణాది రాష్ట్రాలకు, ఆ తర్వాత సౌదీ అరేబియాకు తరలిపోవాల్సి వచ్చింది.

ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని కూటమి 2015 మార్చిలో యుద్ధంలోకి ప్రవేశించింది.

ఇదీ చూడండి: కుప్పకూలిన విమానం- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.