ETV Bharat / international

సైనిక ఆపరేషన్లలో 190 మంది తిరుగుబాటుదారులు మృతి - Yemen Civil War

Houthis killed: యెమెన్​లో హౌతీ స్థావరాలపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు దాడులు జరిపాయి. ఈ ఘటనలో 190 మంది హౌతీలు ప్రాణాలు కోల్పోయారు.

Houthis killed
హౌతీలు మృతి
author img

By

Published : Dec 12, 2021, 7:06 AM IST

Houthis killed: యెమెన్​లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుగుబాటుదారులపై దాడులు జరిపాయి. ఈ ఘటనలో 190 మంది హౌతీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ప్రభుత్వ దళాలు శనివారం తెలిపాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఈ దాడులు జరిపినట్లు చెప్పాయి.

మరిబ్ రాష్ట్రంలోని హౌతీ స్థావరాలపై 24 గంటల వ్యవధిలో 36 ఆపరేషన్లు చేపట్టినట్లు సౌదీ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. ఈ ఆపరేషన్లలో హౌతీలకు చెందిన 20 సైనిక వాహనాలు, డ్రోన్ నియంత్రణ యూనిట్లు ధ్వంసమయ్యాయని చెప్పింది.

దాడులు ఎందుకు?

Yemen News: 2014లో ఇరాన్​ మద్దతుతో హౌతీలు.. రాజధాని సనాను చేజిక్కించుకున్నప్పటి నుంచి యెమెన్​లో అంతర్యుద్ధం మొదలైంది. సనా సహా దేశంలోని ఉత్తర భాగాన్ని హౌతీలు హస్తగతం చేసుకున్నారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం తొలుత దక్షిణాది రాష్ట్రాలకు, ఆ తర్వాత సౌదీ అరేబియాకు తరలిపోవాల్సి వచ్చింది.

Yemen Humanitarian Crisis: ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని కూటమి 2015 మార్చిలో యుద్ధంలోకి ప్రవేశించింది. హౌతీ స్థావరాలపై అనేక సార్లు వైమానిక దాడులు జరిపింది. ఇరు పక్షాల పరస్పర దాడులతో యెమెన్​లో తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడింది.

ఇదీ చూడండి: మసీదులో దాచిన ఆయుధాలు పేలి 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.