తూర్పు టర్కీలో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ గురువారం కూలిపోయింది. దీంతో ఇందులో ఉన్న 11 మంది సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలైనట్లు అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బాధితుల్లో ఒక ఉన్నత స్థాయి అధికారి ఉన్నారని సమాచారం.
![10 killed in army helicopter crash in eastern Turkey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10875219_hhfdhf.jpg)
అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:25 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా ఉండే సీక్మీస్ గ్రామానికి సమీపంలో హెలికాప్టర్ కూలిపోయనట్లు గుర్తించారు. బింగోల్ నుంచి తత్వాన్కు ప్రాంతానికి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.
![10 killed in army helicopter crash in eastern Turkey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10875219_th.jpg)
ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది. మంచు, దట్టమైన పొగ కారణంగా హెలికాప్టర్ కూలి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: 'భారత విదేశీ విధానంలో బంగ్లాదేశ్‌కు సముచిత స్థానం'