ETV Bharat / international

ఏజ్ 100+.. 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో జాబ్.. నువ్వు దేవుడివి సామీ! - 84 ఏళ్లుగా ఒకే సంస్థలో పని

Worlds Most Loyal Employee: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారు ఓ వ్యక్తి. ఒకే సంస్థలో ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తిగా గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించిన ఆయన.. ఇటీవల తన 100వ పుట్టిన రోజును కూడా జరుపుకోవడం విశేషం.

Worlds Most Loyal Employee
Worlds Most Loyal Employee
author img

By

Published : Apr 28, 2022, 8:57 PM IST

Worlds Most Loyal Employee: సాధారణంగా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే వారు ఎంతకాలం పని చేస్తారు. ఏడాదో, ఐదేళ్లో.. మరీ నచ్చితే.. రిటైర్మెంట్​ వరకు పని చేస్తారు. అయితే బ్రెజిల్‌కు ఓ వ్యక్తి మాత్రం.. గత 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తూ.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఆయనే వాల్టర్ ఓర్త్‌మాన్. అత్యధిక కాలం ఒకే సంస్థలో పని చేసినందుకు గానూ.. ఆయనకు గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కింది. ఇటీవల ఆయన తన 100వ పుట్టినరోజును జరుపుకున్నారు.

Walter Orthmann loyal employee: 1938 జనవరి 17 నుంచి వాల్టర్ ఓర్త్‌మాన్ బ్రస్క్‌లోని రెనాక్స్ ఎస్​.ఏ అనే టెక్స్‌టైల్ కంపెనీలో పని చేస్తున్నారు. తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాల్టర్ ఈ సంస్థలో చేరారు. షిప్పింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా తన కెరీర్​ను ప్రారంభించారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌, సేల్స్ మేనేజర్‌ ఇలా పలు పదవుల్లో పని చేశారు. తన 84 ఏళ్ల సుదీర్ఘ కెరీర్​లో వాణిజ్య పరంగా అనేక మార్పులను చూశారు. సేల్స్​ మేనెజర్​గా ఉన్నప్పుడు విదేశాల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో తొమ్మిది రకాల తొమ్మిది వేర్వేరు కరెన్సీ డినామినేషన్లలో లావాదేవీలు జరిపిన అనుభవం ఆయన సొంతం. బ్రెజిల్​ విమానయాన చరిత్రలో దాదాపు అన్ని రకాల వాణిజ్య విమానయాన సంస్థలను వాల్టర్​ వినియోగించడం గమనార్హం.

Most Loyal Employee
గిన్నిస్ రికార్డుతో వాల్టర్

ఇన్ని దశాబ్దాలుగా పని చేయడానికి కారణం ఏంటని వాల్టర్​ను అడిగినప్పుడు.. ' పని చేయడానికి ఇష్టపడాలి. నేను అదే స్ఫూర్తితో పని చేస్తున్నాను' అని చెప్పుకొచ్చారు వాల్టర్​. ఫిబ్రవరి 2022 నాటికి రెనాక్స్ ఎస్​.ఏ కంపెనీలో వాల్టర్ అనుభవం 84 సంవత్సరాల 9 రోజులు. ఇంతటి సుధీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్న వాల్టర్.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి చోటు సంపాదించారు. ఏప్రిల్ 19న వాల్టర్​ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయినా ఆయన రిటైర్ అవ్వాలని అనుకోవడం లేదట.

Most Loyal Employee
వందేళ్ల బర్త్​డే సెలబ్రేషన్​లో వాల్టర్

రెనాక్స్ ఎస్​.ఏ కంపెనీలో చేరిన తొలినాళ్లను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు వాల్టర్ ఓర్త్‌మాన్. "అప్పుడు ఫోన్లు లేవు. కంప్యూటర్లు లేవు. టైప్​ రైటర్లు టైప్​ చేసి మెసేజ్​ పంపేవాళ్లు. పబ్లిక్ లైటింగ్ వ్యవస్థ కూడా సరిగా ఉండేది కాదు. వీధులు మురికిగా ఉండేవి. వర్షం పడితే.. బురదగా మారేవి. అయితే ప్రతి ఇంటికి సొంత బావి ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మొబైల్​ ఫోన్లు వచ్చాయి. ఇంటర్నెట్​ కారణంగా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వ్యాపారం చేసుకోవచ్చు. సాంకేతికతకు ధన్యవాదాలు" అని వాల్టర్ ఓర్త్‌మాన్ పేర్కొన్నారు.

Most Loyal Employee
వాల్టర్

ఎక్కువ కాలం పని చేయాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏంటని బ్రెజిలియన్ వార్తా సైట్ 'గ్లోబో' అడగ్గా.. ఓర్త్‌మాన్ ఈ విధంగా స్పందించారు. "కోపం వద్దు. నవ్వుతూ పని చేయండి. మీకు నచ్చిన పని చేయండి. నాకు ఈ కంపెనీలో పనిచేయడం ఇష్టం. శతృత్వం వద్దు. అవసరం అయితే క్షమాపణలు చెప్పండి. ప్రశాంతంగా జీవించండి. జీవితాన్ని ఆస్వాదించండి" అని చెప్పుకొచ్చారు వాల్టర్.

ఇదీ చదవండి: 'జీ హుజూర్​' అనకపోతే అంతు చూస్తామంటున్న మాస్కో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.