ETV Bharat / international

800 కోట్లకు ప్రపంచ జనాభా.. పుడమికి మరిన్ని కష్టాలు!

నవంబర్​ 15 నాటికి ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకోనుంది. ఈ భూమి మీద ఉండే జనాభా మంగళవారానికి 800 కోట్లు దాటనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తుంది. అయితే.. ప్రపంచ జనాభా రానురాను పెరుగుతుంటే మున్ముందు ప్రస్తుతం ఉన్నంత సౌకర్యవంతంగా జీవించగలుగుతామా అన్నది ప్రశ్నలా మారనుంది! మరో వైపు ఈ భారం ప్రకృతి వనరులపై పడి ఎన్ని విపత్తులకు దారి తీస్తుందో అన్న భయం లేకపోలేదు! పుడమికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు?

world population to reach 8 billion
రేపు ప్రపంచ జనాభా
author img

By

Published : Nov 14, 2022, 7:03 AM IST

Updated : Nov 14, 2022, 7:27 AM IST

ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకోనుంది. నవంబర్‌ 15 నాటికి భూమి మీద జన సంఖ్య 8 వందల కోట్లను దాటనుందని ఐరాస అంచనా. 48 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి.. ఆయుర్దాయం గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. పెరుగుదల సరే.. మరి ఇంత భారీ జనాభా మున్ముందు సౌకర్యవంతంగా జీవించగలదా? ఆహార భద్రత మాటేమిటి? ఆరోగ్య సంరక్షణ ఎలా?.. ఇలాంటి సందేహాలెన్నో ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ప్రకృతి వనరులపై పడే భారం.. పెరిగే భూతాపం.. ఫలితంగా విరుచుకుపడే విపత్తులు, కరవులు, నీటి కొరత వంటి అంశాలు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనుషులంతా సుస్థిరమైన లక్ష్యాలతో పుడమిని కాపాడుకునే ఉమ్మడి బాధ్యతను స్వీకరించాలని ఐరాస కోరుతోంది.

క్రీస్తు పూర్వం 8000 సంవత్సరం ప్రాంతంలో ప్రపంచ జనాభా దాదాపు 50 లక్షలుగా ఉండేదని అంచనా. క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి అది 20 కోట్లకు చేరింది. కొన్ని అంచనాలు మాత్రం 30 కోట్లు, 60 కోట్లు అని కూడా చెబుతున్నాయి.

ఏ సంవత్సరంలో ఎన్ని కోట్లు

ఎప్పటికి ఎంత పెరుగుదల?
1804 సంవత్సరంలో ప్రపంచంలో మానవుల సంఖ్య వంద కోట్లకు చేరింది. పారిశ్రామిక విప్లవంతో ఆర్థిక పురోభివృద్ధి ఊపందుకుంది. వైద్యంలో అద్భుత పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా శిశువుల్లో ఇవి బాగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ జనాభా 200 కోట్ల స్థాయికి చేరుకోవడానికి 126 ఏళ్లు మాత్రమే పట్టింది. 300 కోట్ల మార్కుకు మరో 30 ఏళ్లు, 400 కోట్ల స్థాయికి 14 ఏళ్లు, 500 కోట్ల మార్కును తాకడానికి 13 ఏళ్లు పట్టింది. 600 కోట్ల స్థాయిని మాత్రం చాలా వేగంగా 11 సంవత్సరాల్లోనే మానవాళి సాధించింది. అనంతరం 700 కోట్ల స్థాయిని తాకడానికి 12 ఏళ్లు పట్టింది. 800 కోట్ల మార్కుకూ ఇంతే సమయం అవసరమైంది.

ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచం జనాభా
  • 20వ శతాబ్దంలోనే ప్రపంచ జనాభా 165 కోట్ల నుంచి 600 కోట్లకు పెరిగింది.
  • అయితే పెరుగుదల రేటు తగ్గుతుండటం వల్ల ప్రపంచ జనాభా రెట్టింపు కావడానికి మరో 200 ఏళ్లు పట్టొచ్చు.

అడవుల నరికివేత..
గత 50 ఏళ్లలో మానవ జనాభా రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. అడవుల్లోని క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మాత్రం సరాసరిన మూడింట రెండొంతుల మేర తగ్గిపోయాయి. మన అవసరాల కోసం యథేచ్ఛగా వనాలను నరికేయడమే ఇందుకు కారణం. గత 60 ఏళ్లలో ప్రపంచ అటవీ విస్తీర్ణం 81.7 మిలియన్‌ హెక్టార్ల మేర తగ్గింది. మానవ చర్యల వల్ల భూమిపై మూడొంతుల ప్రాంతం, సాగరాల్లో రెండొంతులు భాగం మార్పులకు లోనైంది. పుడమిపై ఉన్న క్షీరదాల బయోమాస్‌లో మూడొంతుల వాటా మానవులదే. మిగిలినదాన్లో చాలా భాగాన్ని మనం పెంచుకుంటున్న పశువులు ఆక్రమించుకున్నాయి. మొత్తం క్షీరదాల్లో వన్యప్రాణుల వాటా 2 శాతమే కావడం గమనార్హం.

  • మానవ చర్యల వల్ల 10 లక్షలకుపైగా జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. జనాభా పెరుగుదలతో ఇది ఇంకా తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • జీవవైవిధ్యం తగ్గిపోవడం, వనరులపై భారం పడటం మానవాళి మనుగడకూ ముప్పే. పెరుగుతున్న జనాభాకు ఆహారం, తాగునీరు, ఆవాసం, వైద్యం అవసరం. ప్రకృతి ఆరోగ్యంగా ఉంటేనే ఇది సాధ్యం.

ఎంత కష్టం.. ఎంత నష్టం..
పెరుగుతున్న జనాభా వల్ల భూమికి, పర్యావరణానికి, జీవజాలానికి, చివరికి మానవులకూ ఎన్నో ఇబ్బందులు పొంచి ఉంటాయి.

ఉద్గారాలకు రెక్కలు..
శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ప్రపంచ గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల భూతాపం అంతకంతకూ హెచ్చుతోంది. ఆర్థిక, జనాభా వృద్ధి ఇందుకు తోడవుతోంది. ఫలితంగా ప్రకృతి విపత్తులు పెరగడం, పంట దిగుబడులు తగ్గడం, అకాల మరణాలు వంటివి చోటుచేసుకుంటున్నాయి.

మహమ్మారుల ప్రమాదం
ప్రకృతిలోకి మనం అతిగా చొరబడటం వల్ల.. జంతువుల నుంచి పుట్టుకొచ్చే జూనోటిక్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. కొవిడ్‌-19, సార్స్‌, ఎబోలా వంటివి ఇందుకు ఉదాహరణలు. అడవులను కొట్టేయడం, వన్యప్రాణుల వర్తకం, వేట వంటివి ఇందుకు దోహదపడుతున్నాయి. అధిక జనాభాతో ఈ విధ్వంసం మరింత పెరుగుతుంది. జనాభా సాంద్రత పెరగడం వల్ల కొత్త వైరస్‌లు చాలా సులువుగా వ్యాప్తి చెందుతాయి.

దుర్బల వర్గాలకు ఎక్కువ ముప్పు
జనాభా వేగంగా పెరిగే ప్రాంతాల్లో పర్యావరణ, మానవతా సంక్షోభం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలకు నెలవుగా ఉన్న ఆఫ్రికాలోని సహారా ఎడారి చుట్టుపక్కల దేశాల్లో 2020 నుంచి 2050 మధ్య ప్రపంచ జనాభా రెట్టింపవుతుందని అంచనా. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో ఆఫ్రికా ఖండం వాటా 18 శాతంగా ఉంది. 2100 నాటికి అది 38 శాతానికి చేరొచ్చు. అంటే.. పేదల సంఖ్య బాగా పెరుగుతుందన్నమాట!

  • అధిక జనాభా కారణంగా పేదరికం, ఆకలి, పోషకాహార లోపం వంటి వాటి నిర్మూలన కత్తిమీద సామవుతుంది.
జన భారతావని

వచ్చే ఏడాది భారత్‌ నంబర్‌ 1
ఐరాస అంచనాల ప్రకారం.. 2023లో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా భారత్‌ నిలుస్తుంది. ప్రస్తుతం మన దేశంలో జన సంఖ్య 141.2 కోట్ల మేర ఉంది. 2050 నాటికి అది దాదాపు 170 కోట్లకు చేరుకోవచ్చు.

  • 2050 నాటికి చైనా జనాభా 130 కోట్లకు తగ్గొచ్చు. ఈ శతాబ్దం చివరి నాటికి అది 80 కోట్లకు పడిపోవచ్చు.
  • 2050 నాటికి జనాభా పరంగా మొదటి పది స్థానాల్లో ఉండే దేశాలివి.. 1.భారత్‌, 2.చైనా, 3. నైజీరియా, 4. అమెరికా, 5.పాకిస్థాన్‌, 6.ఇండోనేసియా, 7.బ్రెజిల్‌, 8.ఇథియోపియా, 9.కాంగో, 10.బంగ్లాదేశ్‌
  • 2050 నాటికి పెరిగే జనాభాలో సగం ఈ దేశాల్లోనే..
  • కాంగో, ఈజిప్ట్‌, ఇథియోపియా, భారత్‌, నైజీరియా, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, టాంజానియా
మహిళ సంతానోత్పత్తి
  • 2022లో ప్రపంచ జనాభాలో పురుషులు 50.3 శాతం, మహిళలు 49.7 శాతం ఉన్నారు. ఈ అంతరం క్రమంగా తగ్గుతుంది. 2050 నాటికి అది దాదాపు సమాన స్థాయికి చేరొచ్చు.
పెరుగుతున్న మనిషి సగటు ఆయుర్దాయం

Last Updated : Nov 14, 2022, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.