ETV Bharat / international

అమెరికా సైన్యం దాడులు.. 30 మంది తీవ్రవాదులు మృతి - Al Shabaab america somalia

సోమాలియాలో అమెరికా చేపట్టిన మిలిటరీ దాడుల్లో అల్​ శబాబ్​ తీవ్రవాద సంస్థకు చెందిన 30 మంది చనిపోయారు. తీవ్రవాద సంస్థకు చెందిన 100 మందికి పైగా మిలిటరీపై చేసిన దాడులకు ఆత్మరక్షణగా ఈ దాడులు చేశామని అధికారులు వెల్లడించారు.

US strike kills 30 Al Shabaab fighters in Somalia

author img

By

Published : Jan 22, 2023, 6:33 AM IST

Updated : Jan 22, 2023, 7:34 AM IST

సోమాలియాలో అమెరికా చేపట్టిన మిలిటరీ దాడుల్లో ఇస్లామిస్ట్​ అల్​ శబాబ్​కు చెందిన దాదాపు 30 మంది తీవ్రవాదులు చనిపోయారు. ఈ ఘటన సెంట్రల్ సోమాలియాలోని గాల్కాడ్​ అనే టౌన్​ సమీపంలో జరిగింది. ఈ మేరకు యూఎస్​ ఆఫ్రికా కమాండ్​ వివరాలు వెల్లడించింది. 'అల్​ఖైదాతో సంబంధమున్న అల్​ శబాబ్​ సంస్థకు చెందిన​ 100 మందికి పైగా తీవ్రవాదులు దాడులు చేశారు. వారిని నిలువరించేందుకు ఆత్మరక్షణ చర్యగా సోమాలియా నేషనల్​ ఆర్మీతో కలిసి యూఎస్​ దాడులు చేసింది' అని ఓ యూఎస్​ ఆఫ్రికా పేర్కొన్నట్లుగా ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాల ద్వారా తెలుస్తోంది.

అమెరికా రక్షణ విభాగం పెంటగాన్​ చేసిన విజ్ఞప్తి మేరకు సోమాలియా మిలిటరీకి సపోర్ట్​ అందిస్తోంది యూఎస్. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు మే 2022 నుంచి దాదాపు 500 ట్రూపులు సోమాలియాలో మోహరించింది యూఎస్. కాగా, సోమాలియా నుంచి సైన్యాన్ని వెనక్కు పంపించాలని 2020లో డోనాల్డ్​ ట్రంప్ నిర్ణయించారు. 'ఆఫ్రికా ఖండంలో కెల్లా సోమాలియా స్థిరంగా, భద్రతకు కేంద్రంగా ఉంది. అల్​ఖైదాతో సంబంధమున్న అల్​ శబాబ్​ను ఎదుర్కొనేందుకు అమెరికా.. తన భాగస్వామి​ సైన్యానికి సపోర్ట్​ అందిస్తుంది. శిక్షణ, సలహాలు ఇస్తుంది.' అని యూఎస్​ మిలిటరీ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, ఇటీవల కాలంలో అమెరికా చాలా దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా మంది అల్​ శబాబ్​ ఉగ్రవాదులు మృతిచెందారు. గతేడాది అక్టోబర్​లో అమెరికా చేసిన దాడుల్లో ఇద్దరు అల్ శబాబ్​ ఉగ్రవాదులు మృతిచెందారు. అంతకముందు నవంబర్​లో యూఎస్​ జరిపిన దాడుల్లో 17 మంది టెర్రరిస్టులు మరణించారు. ఇక డిసెంబర్​ చివరలో జరిగిన దాడుల్లో ఆరుగురు తీవ్రవాదులను అమెరికా సైన్యం హతమార్చింది.

Last Updated : Jan 22, 2023, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.