ETV Bharat / international

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి! - firing at us walmart

అమెరికా వర్జీనియాలోని ఓ వాల్‌మార్ట్ స్టోర్‌లో మంగళవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. మరికొందరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

US Shooting at Walmart store in Virginia

author img

By

Published : Nov 23, 2022, 12:29 PM IST

Updated : Nov 23, 2022, 6:30 PM IST

అమెరికా వర్జీనియాలోని ఓ వాల్‌మార్ట్ స్టోర్‌లో మంగళవారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. మరికొందరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మరణించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రుల కోసం సహాయక చర్యలు ప్రారంభించారు.

స్థానిక టీవీ ఛానల్​ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సుమారు రాత్రి 10.12 గంటలకు.. చిసాపీక్​లోని వాల్​మార్ట్​లో కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కొంత మంది మరణించగా.. క్షతగాత్రులను రక్షించిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కుప్పకూలిన కవరేజ్​ హెలికాప్టర్​..
అమెరికాలోని నార్త్ కరోలినా టెలివిజన్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు సిబ్బంది మంగళవాం జరిగిన హెలికాప్టర్ క్రాష్​లో దుర్మరణం పాలయ్యారు. ఇందులో పైలట్​తో పాటు వాతావరణ నిపుణుడు జాసన్ మేయర్స్ ఉన్నారని అధికారులు తెలిపారు. ఓ న్యూస్​ కవరేజ్​ కోసం వెళ్లిన ఆ హెలికాప్టర్​ ఉదయం 11 గంటల సమయంలో షార్లెట్-ఏరియా ఇంటర్‌స్టేట్‌లో కూలిపోయింది.

Last Updated : Nov 23, 2022, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.