ETV Bharat / international

'ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం'

మహ్మద్ ప్రవక్తపై రాజకీయ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు అమెరికా తెలిపింది. మానవ హక్కులపై గౌరవాన్ని పెంపొందించుకోవాలని భారత్​ను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొంది.

BJp CONTROVERSY
అమెరికా, నుపూర్​ శర్మ
author img

By

Published : Jun 17, 2022, 1:14 PM IST

మహ్మద్ ప్రవక్తపై భాజపా మాజీ నేతలు నుపూర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చెసిన అనుచిత వ్యాఖ్యలు.. అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారాయి. భారత్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపే పలు ఇస్లామిక్ దేశాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఈ వివాదంపై తాజాగా అమెరికా స్పందించింది. మత స్వేచ్ఛతో పాటు మానవ హక్కుల ఆందోళనలపై భారత్​తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తామని తెలిపింది.

"భాజపాకు చెందిన ఇద్దరు నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. అదే సమయంలో ఈ వ్యాఖ్యలను పార్టీ బహిరంగంగా ఖండించడాన్ని గమనించాం. మత స్వేచ్ఛతో సహా మానవహక్కుల ఆందోళనలపై భారత ప్రభుత్వంలోని సీనియర్ స్థాయి వ్యక్తులతో నిత్యం సంప్రదింపులు జరుపుతుంటాం. మానవ హక్కులపై గౌరవాన్ని పెంపొందించుకోవాలని భారత్‌ను ప్రోత్సహిస్తున్నాం"

-నెడ్‌ప్రైస్, అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

నుపుర్ శర్మ ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. భాజపా ఆమెను సస్పెండ్ చేసింది. ఇదే విషయంలో మరో నేత నవీన్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలు నిరసన తెలిపాయి. అయితే తమకు అన్ని మతాలూ సమానమేనని, ఎవరినీ అవమానించడం లేదని భారత్‌ స్పష్టంచేసింది.

ఇదీ చూడండి: 'నుపుర్​' మాటలపై మంటలు.. ఇస్లామిక్ దేశాల భగ్గు

భాజపా నేతల వ్యాఖ్యలతో చిక్కులు.. భారత దౌత్య సమర్థతకు అగ్ని పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.