ETV Bharat / international

సముద్రగర్భంలో సాహసం.. 100 రోజుల పాటు నీటిలోనే.. అందుకేనట!

అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యోమగాముల గురించి మాత్రమే మనకు తెలుసు. అయితే సముద్రంలో గర్భంలో కూడా కొందరు రోజుల పాటు నివసిస్తుంటారని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే.. అమెరికాలో పాఠాలు చెప్పే ఓ ప్రొఫెసర్​ నీటిలోపల 100 రోజులు పాటు ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఓ ప్రయోగం చేస్తున్నారు. ఆ ప్రయోగం ఏంటి.. అలా ఆయన ఎందుకు చేస్తున్నారో తెసుకుందామా మరి!

underwater living
underwater living
author img

By

Published : Apr 4, 2023, 8:33 PM IST

అమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్ 100 రోజుల పాటు సముద్రగర్భంలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మానవ శరీరం దీర్ఘకాలం పాటు అధిక ఒత్తిడికి గురైతే శరీల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేెందుకు ఆయన ఈ అధ్యయనం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆ ప్రొఫెసర్​ ఈ వినూత్న ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఆయనే అమెరికాకు చెందిన జోసెఫ్​ డిటూరియా అనే సైన్స్​ ప్రొఫెసర్​. జోసెఫ్​ ఆ ప్రయోగం దిగ్విజయంగా పూర్తి చేస్తే ఆయనే ప్రపంచంలో ఎక్కువ రోజుపాటు నీటిలో నివసించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డ్​ బద్దలు కొడతారు.

జోసెఫ్​ డిటూరియా(55) యూఎస్​ మాజీ నేవీ డైవర్​. ప్రస్తుతం సౌత్​ ఫ్లోరిడాలోని ఓ యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు బోధిస్తున్నారు. మనుషులు దీర్ఘకాలం పాటు.. నీటిలో ఉండి విపరీతమైన ఒత్తిడికి గురైతే దాని ప్రభావం మానవ శరీరంపై ఎలా ఉంటుందో అనే అంశంపై ఆయన ఓ అధ్యయనం చేస్తున్నారు. దీర్ఘకాలం పాటు హైపర్‌ బేరిక్ ప్రెజర్‌(భూ ఉపరితలం కన్నా అధిక ఒత్తిడి)కు గురైతే శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోనున్నారు. అందుకే భూమిపై కాకుండా 100 రోజులు నీటిలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచనతో జోసెఫ్​ ఈ ప్రయోగం చేపట్టారు. జోసెఫ్​ ప్రయోగం దిగ్విజయంగా పూర్తైతే.. సముద్రంలో ఎక్కువ రోజులు నివసించిన వ్యక్తిగా ఆయన ప్రపంచ రికార్డ్ నెలకొల్పనున్నారు.

underwater living
జోసెఫ్​ డిటూరియా

జోసఫె ఈ ప్రయోగం కోసం ఫ్లోరిడాలోని కీస్​ సముద్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సముద్రంలో 30 అడుగుల లోతులో.. కేవలం 100 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న 'జూల్స్‌ అండర్‌ సీ లాడ్జ్‌'లో ఆయన నివసిస్తున్నారు. లాడ్జి లోపలికి నీరు ప్రవేశించకుండా ఉండడానికి నిరంతరం గాలిని లోపలికి పంప్‌ చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల భూమి ఉపరితలంతో పోల్చితే జోసెఫ్​ ఉంటున్న లాడ్జ్​ లోపల 1.6రెట్లు అధిక పీడనం ఉంటుంది. ఒక ప్రత్యేక వైద్య బృందం జోసెఫ్​ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ వైద్య బృందం జోసెఫ్​కు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. ఆ పరీక్షలు ఆయన మానసిక, శారీకర సంబంధమైన మార్పులు తెలుసుకునేలా ఉంటాయి. రక్త ప్రసరణ, అల్ట్రాసౌండ్‌, ఎలక్ట్రో కార్డియోగ్రామ్స్‌, స్టెమ్ సెల్ పరీక్షల ద్వారా ఎప్పటికప్పుడు జోసెఫ్​కు సంబంధించిన సమాచారాన్ని ఆ వైద్య బృందం సేకరిస్తుంది. మార్చి నెల ప్రారంభంలో జోసెఫ్‌ సముద్రగర్భంలోకి వెళ్లారు. ఆయన జూన్‌ 9 వరకు అక్కడే ఉండనున్నారు. 2014లో కూడా ఇలా నీటిలో జీవించే ప్రయోగం జరిగింది. టెన్నెస్సీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు 73 రోజుల పాటు నీటిలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు.

పొంచి ఉన్న ఆరోగ్య ముప్పు..
సముద్రంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అన్న విషయం ప్రతీ డైవర్​కు తెలుసు. అయితే జోసెఫ్​ ఉంటున్న లాడ్జ్​ గోడలు చాలా సున్నితంగా ఉన్నందున గాలిలో ఉండే నైట్రోజన్​ ఆయన రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల పనితీరుపై కొంత ప్రభావం చూపుతుంది. జోసెఫ్​కు కొద్ది మొత్తంలో మాత్రమే సూర్యరశ్మి తగులుతుంది. ఫలితంగా అతని జీవక్రియల్లో పలు మార్పులు జరుగుతాయి. జోసెఫ్​ ముందున్న అతిపెద్ద సమస్య.. డీ విటమిన్ లోపమే. సూర్యరశ్మి తగినంత లేకపోవడం వల్ల డీ విటమిన్​ పొందడం కష్టం అవుతుంది. దీంతో ఆయనకు ఎముకలు, కండరాలు బలహీనపడి.. రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది.

నాసా నివేదిక ప్రకారం ఏ వ్యక్తి అయితే నీటిలో నివాసం ఉంటారో అతని రోగనిరోధక శక్తి 14 రోజుల తర్వాత క్షీణిస్తుంది. ప్రస్తుతం జోసెఫ్​ ఉంటున్న లాడ్జ్​లో డీ విటమిన్ కోసం కృత్రిమ పద్ధతిలో యూవీ విద్యుత్​ దీపాలను ఏర్పాటు చేశారు. జోసెఫ్ తన నివాసంలో నడవడం, ఈత కొట్టడం మాత్రమే చేయగలడు. ప్రస్తుతం నీటిలో నివాసం ఉంటున్న జోసెఫ్​ తన ఆరోగ్యం కాపాడుకోవండం కోసం చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేస్తున్నారు.

ఆ కారణంతోనే ప్రయోగం!
జోసెఫ్​ సైన్యంలో పనిచేసిన సమయంలో జవాన్లకు బుల్లెట్లు, పదునైన ఆయుధాలు తగలి గాయలవ్వడం చూస్తుండేవారు. వారు ఆ గాయాల నుంచి కోలుకోవడం దాదాపుగా అసాధ్యం. అలా గాయాలపాలైన వారి కోసం తన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఈ పరిశోధన మొదలు పెట్టినట్లు జోసెఫ్‌ తెలిపారు. దీనిలో భాగంగానే హైపర్‌ బేరిక్‌ ప్రెజర్‌ గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. మెదడు దెబ్బతిన్న వారి శరీరంలోకి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ వెళ్లేలా చేసి చికిత్స చేయడం ద్వారా కాస్త మెరుగైన ఫలితాలు వస్తున్నాయని జోసెఫ్​ తెలుసుకున్నారు. ఈ క్రమంలో అధిక పీడనానికి గురైన కణాలు ఐదు రోజుల్లోనే రెట్టింపు అవుతాయని ఆయన గుర్తించారు. ఇలా చేస్తే మనిషి ఆయుర్దాయం పెరుగుతుందని, వృద్ధాప్య సంబంధిత వ్యాధులు దరిచేరవనే ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ కారణంతోనే జోసెఫ్‌ 100 రోజులు నీటిలో నివసించే ప్రయోగానికి సిద్ధమయ్యారు.

రికార్డ్స్​తో సంబంధంలేదు.. ఫలితమే ముఖ్యం!
మునుపటి అధ్యయనాల ఫలితాలను అభివృద్ధి చేయడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. అధిక ఒత్తిడికి గురైన కణాలు ఐదు రోజులలో రెట్టింపు అవుతాయని ఈ ప్రయోగం చెబుతోంది. మనుషులు జీవించడానికి కావాల్సినవన్నీ భూమిపై ఉన్నాయని.. కానీ మొండి వ్యాధులను నయం చేసే శక్తి సముద్రంలో ఉన్న కొన్ని జీవుల్లో ఉందని జోసెఫ్‌ డిటూరి అంటున్నారు. దాన్ని కనుక్కుంటే సరిపోతుందని ఆయన బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. దీని కోసం మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన కోరారు. మానవ శరీరం ఎక్కువ రోజులు నీటిలో ఉండలేదని.. ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు జోసెఫ్ వెల్లడించారు. నీటిలోని పీడనం అధికంగా ఉన్నందున ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు ఏ రికార్డ్స్​పైన ఆసక్తి లేదని.. తన ప్రయోగ ఫలితమే ముఖ్యమని ఆయన అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.