ETV Bharat / international

ఉక్రెయిన్​పై దాడులు చేస్తూనే.. మరోవైపు చర్చలకు రష్యా సన్నద్ధం!

Ukraine leader Zelenskyy: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. రష్యా జరిపిన క్షిపణి దాడిలో తమ చమురు స్థావరం దెబ్బతినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. డోనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాల్లో రష్యా దాడులను తిప్పికొట్టినట్లు ప్రకటించింది. తమ బలగాల తీవ్ర ప్రతిఘటనతో కీవ్‌ నుంచి రష్యా సేనలు వెనక్కి వెళ్లిపోయినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. ఓవైపు యుద్ధాన్ని కొనసాగిస్తూనే మరోమారు శాంతి చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్‌ రష్యా నేతలు సిద్ధమయ్యారు.

Ukraine leader Zelenskyy  says he seeks peace 'without delay' in talks

author img

By

Published : Mar 28, 2022, 8:16 PM IST

Ukraine leader Zelenskyy: ఉక్రెయిన్‌పై గత కొన్ని రోజులుగా విరుచుకుపడ్డ రష్యా దాడుల తీవ్రతను కాస్త తగ్గించింది. లుట్స్క్ ప్రాంతంలోని ఆయిల్ డిపోపై రష్యా వైమానిక దళాలు క్షిపణి దాడికి తెగబడినట్లు వాయవ్య ఉక్రెయిన్ గవర్నర్.. వొలిన్ ఆరోపించారు. బెలారస్ భూభాగం నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు టెలిగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఉక్రెయిన్‌ లుహాన్స్క్‌ ప్రాంతంలోని రుబిజ్నే పట్టణంపై రష్యా దళాలు మరోసారి కాల్పులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఓ పౌరుడు మృతి చెందినట్లు స్థానిక గవర్నర్‌ సెర్హీ హేడే వెల్లడించారు. డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా చేసిన ఐదు దాడులను తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి. ఈ ప్రాంతాల్లో రెండు రష్యన్ ట్యాంకులు, పదాతిదళాల వాహనం, ఒక కారును ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. రష్యా వైపు ప్రాణ నష్టం జరిగినట్లు తెలిపాయి. చోర్నోబైవ్కాలోని వ్యూహాత్మక విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రష్యన్‌ దళాలు 12వసారి కూడా విఫలమైనట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు.

స్థానిక ప్రజల తిరుగుబాటుతో చెర్నోబిల్ పట్టణంగా పిలిచే స్లావిచ్ ప్రాంతాన్ని రష్యా సేనలు వీడినట్లు స్థానిక మేయర్ వెల్లడించారు. రష్యా తన సేనలను కీవ్ నుంచి ఉపసంహరించుకుందని ఉక్రెయిన్ మిలటరీ తెలిపింది. తమ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో రష్యా దళాలు వెనక్కి వెళ్లినట్లు ఉక్రెయిన్ మిలటరీ వెల్లడించింది. కీవ్‌లో ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ ద్వారా తరగతులు ప్రారంభం అయ్యాయి. రష్యా ఆధీనంలోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు ఉక్రెయిన్ ఉన్నతాధికారి లియుడ్మిలా డెనిసోవా తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున రేడియో ధార్మిక కిరణాలు ఆకాశంలో కలుస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

తూర్పు డాన్‌బాస్ రీజియన్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంపై రష్యా దృష్టిసారించినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా సైనిక చర్య కారణంగా ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు 564.9 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్‌ ఆర్థిక మంత్రి యూలియా స్వెరెదెంకో వెల్లడించారు. 8 వేల కి.మీ.ల రోడ్లు, కోటి చదరపు మీటర్ల విస్తీర్ణం మేర గృహాలు ధ్వంసమయ్యాయని వివరించారు. ఇప్పటివరకు 38 లక్షలకుపైగా ప్రజలు ఉక్రెయిన్‌ను వీడారని ఐరాస శరణార్థుల ఏజెన్సీ-యూఎన్​హెచ్​సీఆర్​ వెల్లడించింది. వారిలో 90 శాతం మంది మహిళలు, చిన్నారులేనని తెలిపింది. 22 లక్షలకుపైగా పౌరులు పోలాండ్‌లోకి ప్రవేశించారన్న యూఎన్​హెచ్​సీఆర్​.. రొమేనియాలోకి అయిదు లక్షలు, మాల్డోవా, హంగేరీల్లోకి మరో మూడు లక్షలకుపైగా ఉక్రెనియన్లు వెళ్లారని వివరించింది.

రష్యా ఇంధన దిగుమతులకు.. రూబుల్స్​లో చెల్లింపులు చేయాలన్న ఆ దేశ డిమాండ్​ను జీ7 దేశాలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. భారత కంపెనీలు కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురుకు చెల్లింపులు రూపాయిల్లో చెల్లించే ప్రణాళికలు ఏమీ చేయట్లేదని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్​ తేలీ.. రాజ్యసభకు తెలిపారు. రష్యాలో వ్యాపారాల నిర్వహణ నుంచి మరిన్ని సంస్థలు బయటకు వచ్చాయి. ఆ దేశంలో కొత్త పెట్టుబడులు, ఎగుమతులు నిలిపేస్తామని ప్రకటించిన నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ బ్రూవర్‌ 'హేనికెన్‌'.. తాజాగా రష్యాలో తమ కార్యకలాపాలకు ముగింపు పలుకుతున్నట్లు తెలిపింది. తామూ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు, రష్యా మార్కెట్‌ నుంచి బయటకు రావాలని నిర్ణయించినట్లు కాల్స్‌బర్గ్‌ ప్రకటించింది.

టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు మంగళవారం ప్రారంభమయ్యే అవకాశం ఉందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. చర్చలు ఈరోజే ప్రారంభం కావచ్చని టర్కీ భావించగా.. ఈ అవకాశాన్ని పెస్కోవ్ తోసిపుచ్చారు. తమ ప్రతినిధులు గంటల వ్యవధిలోనే అక్కడికి చేరుకోలేరన్నారు. ఇదిలా ఉండగా.. రష్యా, టర్కీ అధ్యక్షులు పుతిన్, ఎర్డోగాన్‌లు ఆదివారం ఫోన్‌లో మాట్లాడి.. ఇస్తాంబుల్‌లో చర్చలకు అంగీకరించారు. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదరగలదని టర్కీ ఆశిస్తోంది. ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య పలుదఫాల చర్చలు జరిగినా.. ప్రధాన పురోగతి రాలేదు. పెస్కోవ్‌ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇస్తాంబుల్‌ వేదికగా జరిగే ఈ సమావేశంలోనైనా శాంతి స్థాపనకు అంగీకారం కుదురుతుందని ఆశిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: యుద్ధ రంగంలోకి బెలారస్‌.. రష్యాతో కలిసి ఉక్రెయిన్​పై దాడులు..!

అణ్వస్త్ర పరీక్షకు కిమ్ సిద్ధం! టార్గెట్ అమెరికా!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.