ETV Bharat / international

భారతీయ యువతకు గుడ్​న్యూస్​.. 2,400 యూకే వీసాలు జారీ - హెచ్​ 1బీ వీసా గడువు పెంపు

భారతీయులకు గుడ్​న్యూస్​ చెప్పింది యూకే ప్రభుత్వం. యువతకు 2,400 వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. వీసా నిరీక్షణ సమయాన్ని తగ్గించడం వల్ల భారత్​-యూఎస్ సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ తెలిపారు.

uk india visa scheme
యూకే వీసా
author img

By

Published : Feb 22, 2023, 9:45 AM IST

భారతీయులకు గుడ్​న్యూస్ చెప్పింది యూకే ప్రభుత్వం. 18 నుంచి 30 ఏళ్ల వయసున్న అర్హులైన భారతీయ యువతకు 'యూకే-ఇండియా యువ నిపుణుల ఒప్పందం' కింద 2,400 వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను ఓ ప్రకటనలో వెల్లడించింది.

అభ్యర్థి వీసా పొందాలంటే ముందుగా బాలెట్‌ దశలో ఎంపికవ్వాలి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు బాలెట్‌ నమోదుకు అవకాశం ఉంటుంది. దీనిని ఉచితంగానే చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ మొదలుపెట్టాలంటే ఈ వీసా పొందడానికి పూర్తి అర్హత ఉందని అభ్యర్థి తప్పనిసరిగా ప్రకటించాలి. బాలెట్‌ దశలో ఎంపికయిన అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. మంజూరైన తర్వాత ఆరు నెలల్లోగా యూకేకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ దఫా వీసా పొందలేకపోతే జులైలో ప్రారంభమయ్యే రెండో బాలెట్‌ ద్వారా మరోసారి ప్రయత్నించొచ్చు. భారత్‌, యూకే ప్రభుత్వాల మధ్య ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం యూకే యువత రెండేళ్ల పాటు భారత్‌లో ఉండొచ్చు. అదే విధంగా భారతీయులకూ యూకేలో నివసించే అవకాశం ఉంటుంది.

భారత్-అమెరికా మధ్య బంధం మరింత మెరుగు..
వీసా నిరీక్షణ సమయాన్ని తగ్గించడం వల్ల భారత్​-యూఎస్ సంబంధాలు మరింత మెరుగుపడతాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా భారతీయ- అమెరికన్లు ఎదుర్కొంటున్న వీసా సమస్యలు తీర్చేందుకు బైడెన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. వీసా నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు విదేశాంగ శాఖ అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

వీసా రెన్యూవల్ అమెరికాలోనే..
కొద్ది రోజుల క్రితం అమెరికా.. హెచ్​-1బీ వీసాదారులకు శుభవార్త చెప్పింది. హెచ్​-1బీ, ఎల్​1 వీసాల రెన్యూవల్‌ త్వరలో అమెరికాలోనే జరగనున్నట్లు తెలిపింది. 2023 చివరి నుంచి పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని అగ్రరాజ్యం యోచిస్తోంది. ఈ నిర్ణయం వల్ల విదేశీ సాంకేతిక నిపుణులకు ముఖ్యంగా భారత్‌ నుంచి వెళ్లే వేలాదిమందికి ప్రయోజనం కలగనుంది. తమ దేశంలోని కంపెనీలు నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవటానికి వీలుగా అమెరికా మూడేళ్ల కాల పరిమితో హెచ్-​1బీ వీసాలను జారీ చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.