Hindu sisters rape: హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన పాకిస్థాన్, పంజాబ్ రాష్ట్రంలోని బహవల్‌నగర్‌లో జరిగింది. బాధితురాళ్ల వయసు వరుసగా 16, 17 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. జూన్ 5వ తేదీన జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిదంటే: బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అక్కాచెల్లెళ్లను తుపాకీతో బెదిరించి ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు ఉమైర్ అష్ఫాక్, కాషిఫ్ అలీగా గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ఇద్దరు బాలికలకు వైద్య పరీక్షలు చేయించగా.. అత్యాచారం జరిగినట్లు నిర్ధరణ అయిందని చెప్పారు.
నిందితుడు కాషిఫ్ అలీ ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందినవాడు. దీంతో బాధితుల కుటుంబంతో రాజీ కుదుర్చేందుకు కొందరు పలుకుబడి ఉన్న పెద్దలు కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో కేసు నమోదు చేయంటలో మూడు రోజులు జాప్యం జరిగింది. అనంతరం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన ఉమైర్ అష్పాక్‌ను అరెస్టు చేశారు. మరొక నిందితుడు కాషిఫ్ అలీ.. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: Musharraf: ఎయిర్ అంబులెన్స్‌లో పాకిస్థాన్‌కు ముషారఫ్
హెచ్‌ఐవీకి ఇజ్రాయెల్ మందు... ఒక్క డోసుతో వైరస్ ఖతం.. మార్కెట్లోకి అప్పుడే!