ETV Bharat / international

అమెరికాలో టోర్నడో బీభత్సం.. 23 మంది మృతి - మిసిమిసి టోర్నడో నష్టం

అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి మొత్తం 23 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మిసిసిపి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. టోర్నడోల బీభత్సానికి ఇళ్లు, దుకాణాలు, ఇతర ఆస్తులన్ని ధ్వంసమయ్యాయి.

tornado in america 202
అమెరికాలో టోర్నడో బీభత్సం
author img

By

Published : Mar 25, 2023, 6:11 PM IST

Updated : Mar 25, 2023, 7:40 PM IST

అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి మొత్తం 23 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు అదృష్యమయ్యారు. మిసిసిపి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. టోర్నడో బీభత్సానికి ఇళ్లు, దుకాణాలు, ఇతర ఆస్తులన్ని ధ్వంసమసయ్యాయి. తీవ్రమైన గాలివాన, బలమైన ఉరుములతో ఈ టోర్నడో సంభంవించింది. టోర్నడో ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు సరాఫరా నిలిచిపోయింది. అనేక దక్షిణాది రాష్ట్రాల గుండా ఈ టోర్నడో కదిలిందని అధికారులు పేర్కొన్నారు. గోల్ఫ్‌ బంతి సైజులో వడగండ్లు పడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సైతం వెల్లడించాయి.

టోర్నడోల ధాటికి ఈశాన్య జాక్సన్‌, మిస్సిస్సిపిలో 96కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామీణ పట్టణాలైన సిల్వర్‌సిటీ, రోలింగ్‌ ఫోర్క్‌లో టోర్నడోలు విధ్వంసం సృష్టించినట్లు వారు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలకు మరింత సహాయక సిబ్బందిని, అంబులెన్స్​లు పంపిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికే రెస్కూ టీం.. తుఫాన్​ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. టోర్నడో బీభత్సం సృష్టిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. గురువారం రాత్రి, శక్రవారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం సంభవించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"రెస్క్యూ బృందాలు శనివారం ఉదయం నుంచే సహాయక చర్యలు ప్రారంభించాయి. మరికొన్ని రెస్క్యూ బృందాలు సైతం టోర్నడో ప్రభావిత ప్రాంతానికి వెళ్తున్నాయి." అని ఓ అధికారి వెల్లడించారు. ఇళ్లు కూలిపోవడం వల్ల కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఆయన తెలిపారు. "ఇదొక సూపర్ సెల్. అమెరికాలో అత్యంత ఘోరమైన సుడిగాలి, హానికరమైన వడగళ్లను ఈ తుఫాను సృష్టించింది." అని యూనివర్శిటీ ఆఫ్ నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్శిటీ వాతావరణ శాస్త్ర ప్రొఫెసర్ వాకర్ ఆష్లే అన్నారు. కాగా గాయపడిన వారిని అసుపత్రికి తరలించేందుకు రెస్కూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.

"శుక్రవారం నైరుతి మిస్సోరి ప్రాంతంలో నీటి ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు కారుతో పాటే కొట్టుకుపోయారు. మరోవైపు గ్రోవ్‌స్ప్రింగ్ పట్టణంలోనూ నీటి ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఆరుగురు యువకులు ఉన్నారు." అని అధికారులు తెలిపారు. ఆ ఆరుగురిలో నలుగురి ప్రాణాలతో బయటపడ్డారని వారు వెల్లడించారు. మరో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకో ఘటనలో మరో మహిళ సైతం వాహనంతో పాటు కొట్టుకుపోయినట్లు వారు తెలిపారు.

Last Updated : Mar 25, 2023, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.