ETV Bharat / international

జ్యూస్​లో 'వయాగ్రా' పిల్స్.. ఆన్​లైన్​ ఛాలెంజ్ పేరుతో టీనేజర్ల అతి.. చివరకు..

Social Media Viagra Challenge: ఆ విద్యార్థులంతా ఓ ఆన్​లైన్​ ఛాలెంజ్​లో పాల్గొన్నారు. ఫ్రూట్ ​జ్యూస్​లో వయాగ్రా పిల్స్​ వేసుకొని తాగారు. కాసేపటికే 13 మంది ఆస్పత్రి పాలయ్యారు. అసలిది ఎక్కడ జరిగింది? ఏమైంది?

Thirteen teens hospitalised after social media viagra challenge

author img

By

Published : Apr 10, 2022, 4:12 PM IST

Social Media Viagra Challenge: వయాగ్రా పిల్స్​.. శృంగార సమస్యలు ఉన్న వారికి పరిష్కారంగా వచ్చిన ఓ అద్భుతమైన ఔషధం. అయితే దీని కారణంగా 13 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఆన్​లైన్​ ఛాలెంజ్​ పేరుతో విద్యార్థులంతా ​ఫ్రూట్​ జ్యూస్​లో వయాగ్రా పిల్స్​ కలిపి తాగారు. ఈ ఘటన కొలంబియా కుకుటాలోని సాన్​ బార్టోలోమ్​ స్కూల్లో ఏప్రిల్​ 5న జరిగింది.

బాధితులంతా 9వ తరగతి చదివే.. 14-15 ఏళ్ల వయసువారేనని స్థానిక మీడియా పేర్కొంది. ఆన్​లైన్​ ఛాలెంజ్​లో భాగం కావాలని ఆరాటపడ్డ విద్యార్థులు.. పెద్దలు​ మాత్రమే వాడాల్సిన వయాగ్రా మాత్రల్ని భోజన విరామ సమయంలో జ్యూస్​లో కలిపి తీసుకున్నట్లు తెలిపింది. నిమిషాల్లోనే వారిలో గుండె వేగంగా కొట్టుకోవడం సహా ఇతర సమస్యల్ని గుర్తించిన ఉపాధ్యాయులు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితుల్లో ఇద్దరికి తీవ్ర లక్షణాలున్నాయని, మిగతావారిని డిశ్చార్జి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేసింది పాఠశాల యాజమాన్యం. సోషల్​ మీడియాలో పిల్లల కదలికలపై దృష్టి సారించాలని, వాటికి దూరంగా ఉంచాలని హితవు పలికింది.

ఇవీ చూడండి: షూటింగ్ రేంజ్​లో కాల్పులు.. ముగ్గురు మృతి.. 40గన్స్ చోరీ!

'సంక్షోభం నుంచి బయటపడాలంటే.. 300 కోట్ల డాలర్లు కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.