ETV Bharat / international

అఫ్గాన్‌లో 'చైనీస్‌ గెస్ట్‌ హౌస్‌‌‌' పై ఉగ్రదాడి - కాబుల్​ బాంబ్ దాడి

Kabul Chinese Hotel Attack : అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్​లోని ఓ హోటల్​పై ఉగ్రదాడి జరిగింది. భారీ పేలుడుతో పాటు తుపాకీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టత రాలేదు.

Kabul Chinese Hotel Attack
Kabul Chinese Hotel Attack
author img

By

Published : Dec 12, 2022, 7:52 PM IST

Kabul Chinese Hotel Attack : అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌ మరోసారి బాంబు పేలుడు, కాల్పులతో దద్దరిల్లింది. ఈ నగరంలో అత్యంత రద్దీగా ఉండే షహర్‌-ఇ నావ్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉగ్రదాడి జరిగింది. 'చైనీస్‌ గెస్ట్ హౌస్‌'గా పిలిచే ఈ భవనానికి తరచూ చైనా వ్యాపారులు వస్తుంటారు. భారీ పేలుడుతో పాటు తుపాకీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు.

పేలుడు తర్వాత కొందరు సాయుధులు భవనంలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హోటల్‌లో కాల్పులు జరుగుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టత రాలేదు. కాగా.. అఫ్గాన్‌లో చైనీయుల భద్రతపై చైనా రాయబారి వాంగ్‌ యు.. ఆదివారం అఫ్గాన్‌ విదేశాంగ శాఖ అధికారులను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం.

అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రదాడి, కాల్పుల ఘటనలు మరింత పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఇస్లామిక్‌ స్టేట్‌ జరిపిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు రష్యన్‌ ఎంబసీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. నిన్న అఫ్గాన్‌-పాక్‌ సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. బలూచిస్థాన్‌లోని చమన్‌ జిల్లాలోపాక్ పౌరులపై తాలిబన్‌ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా, 17 మందికి గాయాలయ్యాయి.

ఇవీ చదవండి: రిషి సునాక్‌ ముందు మరో సవాల్‌.. పన్నులకు వ్యతిరేకంగా 40 ఎంపీల లెటర్​

ఆ దేశంలో అందరి వయసూ రెండేళ్లు తగ్గుతుందట... అదెలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.