ETV Bharat / international

భద్రతా వైఫల్యం వల్లే అబె హత్య.. తొలి తూటా గురి తప్పినా... - జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు

Shinzo Abe news: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబెకు శుక్రవారం హత్యకు గురయ్యారు. ఆయనకు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అబె ప్రసంగిస్తున్నప్పుడు ఆయన వెనకనున్న ఖాళీ ప్రదేశంపై భద్రత బలగాలు తగినంత దృష్టి సారించలేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అబె హత్యకు గురికావడంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి చెందాయి. షింజో అబె హత్యను ఖండిస్తూ క్వాడ్‌ కూటమి తరఫున భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

shinzo abe security
జపాన్‌ మాజీ ప్రధాని షింజో
author img

By

Published : Jul 10, 2022, 6:49 AM IST

Shinzo Abe news: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబెకు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అబె ప్రసంగిస్తున్నప్పుడు ఆయన వెనకనున్న ఖాళీ ప్రదేశంపై భద్రత బలగాలు తగినంత దృష్టి సారించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. నరాలో సభకు వెళ్లాలని కేవలం ఒకరోజు ముందుగా నిర్ణయించడం, ప్రచార వాహనం పైభాగం నుంచి కాకుండా నేలపై నిల్చొని మాజీ ప్రధాని ప్రసంగించడం వల్ల సులభంగా బలైపోయారని వారు విశ్లేషిస్తున్నారు. భద్రత సమస్యలను నరా పోలీసు అధిపతి తొమొయకి ఒనిజుక అంగీకరించారు.

ప్రపంచ నేతల సంతాపం: అబె హత్యకు గురికావడంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి చెందాయి. ఆయన అందించిన సేవల్ని, తమకున్న అనుబంధాన్ని వివిధ దేశాధినేతలు గుర్తుచేసుకుని సంతాప సందేశాలు వెలువరించారు. అబె భౌతిక కాయాన్ని శనివారం నరా నుంచి టోక్యోకు తీసుకువచ్చారు. పార్థివ దేహాన్ని షిబుయలోని నివాసానికి చేర్చినప్పుడు ప్రజలు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై అధికారులు అబె కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు. దిగ్గజ నేతను పొట్టనపెట్టుకున్న జపాన్‌ నౌకాదళం మాజీ ఉద్యోగి తెత్సుయ యమగామి నివాసంలో భద్రత బలగాలు సోదాలు నిర్వహించినప్పుడు అనేక ఆయుధాలు దొరికాయి. తాను ద్వేషించే ఒక సంస్థతో అబెకు సంబంధం ఉందనీ, అందుకే హత్యకు పన్నాగం రూపొందించానని నిందితుడు విచారణాధికారుల వద్ద వెల్లడించాడు. తల్లిని ఆరాధించే ఒక మతపరమైన బృందమంటే నిందితుడికి ద్వేషమని జపాన్‌ ప్రసార మాధ్యమాలు పేర్కొన్నాయి. అబె కంటే ముందు ఆ మత నాయకుడిని హత్య చేయాలని ప్రణాళిక రచించినట్లు పోలీసులకు యమగామి వివరించాడు. రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తున్నందున అబెను హత్య చేసినట్లు తాను అంగీకరించలేనని అతను తెలిపినట్లు జపాన్‌ పోలీసులు వెల్లడించారు.

ధమనులు, కాలర్‌ బోన్స్‌కు గాయాలు: కాల్పుల కారణంగా ఒక తూటా అబె ఎడమ భుజం నుంచి దూసుకుపోయి.. ధమనులను, కాలర్‌ బోన్స్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని శవపరీక్షలో తేలింది. శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం బయటకు పోయిందని గుర్తించారు.

గురి తప్పిన తొలి తూటా: ఒక మాజీ ప్రధానికి కల్పించాల్సిన స్థాయి భద్రత అబెకు లేదని క్యోటోకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారి ఫుమికజు హిగుచి చెప్పారు. నిందితుడు అంత స్వేచ్ఛగా అబె వెనకకు ఎలా రాగలిగాడో దర్యాప్తు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. యమగామి తొలి విడత కాల్పులు జరిపినప్పుడు తూటా గురి తప్పింది. ఆ శబ్దం విని ఏమైందో చూసేందుకు అబె వెనక్కి తిరిగారు. అప్పుడు రెండో తూటా ఆయన శరీరంలోకి దూసుకువెళ్లింది. మాజీ ప్రధాని భద్రత సిబ్బందిలో ఒకరు తూటారక్షక బ్రీఫ్‌కేసును పైకెత్తినా అప్పటికే నష్టం జరిగిపోయింది. క్షణాల్లో చికిత్స అందించే ప్రయత్నం జరిగినా ఫలితం లేకపోయింది. ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి క్యోటోలో ఒక గిడ్డంగిలో ఫోర్క్‌లిఫ్ట్‌ ఆపరేటర్‌గా ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నాడని, ఎవరితో కలవకుండా మౌనంగా ఉండేవాడని స్థానిక పత్రిక ఒకటి తెలిపింది. గత నెల రోజులుగా రాత్రిపూట రంపం కోత శబ్దం వంటివి అతని ఫ్లాటు నుంచి వినిపించేదని, యమగామిని మాత్రం ఎప్పుడూ కలవలేదని అతని పొరుగు ఫ్లాట్లలో ఉంటున్నవారు చెప్పారు. జపాన్‌ సురక్షిత దేశమనీ, తన భద్రతను పెంచాల్సిన అవసరం లేదని ప్రధాని హోదాలో అబె 2015లో పార్లమెంటులో చెప్పిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

సేవల్ని కొనియాడిన బైడెన్‌, జిన్‌పింగ్‌: చైనా-జపాన్‌ సంబంధాలను మెరుగుపరచడానికి అబె కృషి చేశారని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ కొనియాడారు. ప్రధాని ఫుమియో కిషిదతో కలిసి సహకారాత్మక సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు. జపాన్‌లో అణుబాంబుల బారిన పడిన హిరోషిమాలో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షునిగా బరాక్‌ ఒబామా నిలిచారంటే దానికి కారణం అబె పనితీరేనని చెబుతారు. హత్యోదంతం నేపథ్యంలో జపాన్‌ ప్రధాని కిషిదతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫోన్లో మాట్లాడారు. శాంతి, ప్రజాస్వామ్యాల పరిరక్షణకు అబె చేసిన కృషి కొనసాగుతుందని చెప్పారు. హత్యోదంతంపై తీవ్ర విచారాన్ని, ఆవేదనను వ్యక్తంచేశారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం, క్వాడ్‌ కూటమి ఏర్పాటుకు దివంగత నేత సేవల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తుపాకీ సంస్కృతి అతి తక్కువగా ఉండే జపాన్‌లో అబెను హతమార్చడం అత్యంత విచారకరమని ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌ సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఐరాస భద్రత మండలి కూడా ఘన నివాళులర్పించింది.

హత్యను ఖండిస్తూ క్వాడ్‌ ప్రకటన: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె హత్యను ఖండిస్తూ క్వాడ్‌ కూటమి తరఫున భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. క్వాడ్‌ ఆవిర్భావంలో, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ విషయంలో ఆయన పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఆయన జ్ఞాపకార్థం ఈ ప్రాంతంలో శాంతి, సుసంపన్నత విలసిల్లేలా రెట్టింపు కృషి చేస్తామని ప్రతిన బూనారు. అబె హత్య ఘటన దిగ్భ్రాంతికరమన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ శనివారం దిల్లీలో జపాన్‌ దౌత్య కార్యాలయానికి వెళ్లి, రాయబారి సతొషి సుజుకితో సమావేశమై సంతాపం వ్యక్తపరిచారు.

ఇవీ చదవండి: మహోగ్ర లంక.. నిరసనలతో అట్టుడికిన కొలొంబో.. రణరంగాన్ని తలపించిన రాజధాని వీధులు

భద్రత వలయంలో ఉన్నా.. హత్యకు గురైన నేతలెందరో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.