ETV Bharat / international

రష్యా అధీనంలోకి మరో నగరం.. డాన్‌బాస్‌పై గురి!

Russia Ukraine Crisis: ఉక్రెయిన్​ లుహాన్స్క్‌ ప్రావిన్స్‌లోని లిసిచాన్స్క్‌ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు. ఈ విజయంతో డాన్‌బాస్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలన్న.. తమ లక్ష్యానికి మరింత చేరువైనట్లు చెప్పారు.

Russia Ukraine Crisis
Russia Ukraine Crisis
author img

By

Published : Jul 3, 2022, 6:01 PM IST

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా సేనలు.. క్రమంగా అక్కడి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. లుహాన్స్క్‌ ప్రావిన్స్‌ ఆక్రమణే లక్ష్యంగా.. ముందుకు సాగుతున్న మాస్కో సేనలు పూర్తిగా ఆ ప్రాంతంపై పట్టుబిగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ బలగాల చేతిలో ఉన్న చివరి లుహాన్స్క్‌ ప్రావిన్స్‌ నగరం లిసిచాన్స్క్‌ సైతం రష్యా అధీనంలోకి తెచ్చుకుంది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు. తమ బలగాలు లిసిచాన్స్క్‌ నగరంపై పట్టుసాధించాయని పేర్కొన్నారు. ఈ విజయంతో డాన్‌బాస్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలన్న.. తమ లక్ష్యానికి మరింత చేరువ అయ్యామని అభిప్రాయపడ్డారు.

రష్యా దాడులను ఉక్రెయిన్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. మాస్కో సేనల అధీనంలోని మెలిటోపొల్ నగరంపై విరుచుకుపడింది. మెలిటోపొల్‌లోని రష్యా శిబిరంపై 30కి పైగా దాడులు జరిపినట్లు బహిష్కరణకు గురైన ఆ ప్రాంత మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ తెలిపారు. మెలిటోపొల్‌ పౌరుల శాంతియుత జీవనాన్ని పునరుద్ధరించేందుకు ఉక్రెయిన్‌ సేనలు ఏమైనా చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు ఉక్రెయిన్‌ సరిహద్దు నగరమైన రష్యాలోని బెల్‌గోరోడ్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పేలుళ్ల ధాటికి మొత్తం 11 అపార్ట్‌మెంట్‌ భవనాలు, 39 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిని ధ్రువీకరించిన ఆ ప్రాంత గవర్నర్‌ గ్లాడికోవ్‌ పేలుళ్ల కారణంగా ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేసినట్లు పేర్కొన్నారు. అయితే దాడిపై ఉక్రెయిన్‌ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు.

ఇదీ చదవండి: లక్కీ మ్యాన్.. పొరపాటుగా ఖాతాలోకి 330 రెట్లు ఎక్కువ జీతం.. ఏం చేశాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.