ETV Bharat / international

'చైనాలో కొత్త వైరస్​ ఏమీ లేదు- సీజనల్ శ్వాసకోశ సమస్యలే'- WHOకు డ్రాగన్​ నివేదిక - pneumonia in china

Pneumonia Outbreak In China : ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భయాందోళనలకు చైనా తెరదించింది. చైనాలో చిన్నారుల్లో న్యుమోనియా కేసుల పెరుగుదలకు కొత్త వైరస్ కారణం కాదని తెలిపింది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదికను సమర్పించింది.

Pneumonia Outbreak In China
Pneumonia Outbreak In China
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 2:19 PM IST

Updated : Nov 26, 2023, 4:15 PM IST

Pneumonia Outbreak In China : చిన్నారుల్లో న్యుమోనియా కేసుల పెరుగుదలకు కొత్త వైరస్ కారణం కాదని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక నివేదికను సమర్పించింది. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని నివేదికలో పేర్కొంది. శరవేగంగా వ్యాపించిన శ్వాసకోశ సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేవలం 24 గంటల్లోనే చైనా కచ్చితమైన సమాచారాన్ని అందించిందని ఆ దేశానికి చెందిన సీజీటీఎన్ మీడియా తెలిపింది. బీజింగ్, లియోనోంగ్​లో చేసిన పరీక్షల్లో ఎటువంటి కొత్త వైరస్​ను గుర్తించలేదని పేర్కొంది.

చిన్నారుల్లో న్యుమోనియా కేసులు పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం చైనీస్​ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్​(సీడీసీ) అధికారులతో టెలికాన్పరెన్స్ నిర్వహించింది. అలానే బీజింగ్ పిల్లల ఆసుపత్రి నుంచి కూడా సమాచారం కోరింది. ఈ విషయంపై ఆసుపత్రి శ్వాసకోస విభాగం డైరెక్టర్ ఝావో షన్నియింగ్ మాట్లాడారు. " మేము సీడీసీ నుంచి పొందిన డేటా ప్రకారం మైకోప్లాస్మాలో ఎటువంటి మార్పు లేదు. మైకోప్లాస్మా నిమోనియా చైనాలో చాలా ఏళ్ల నుంచి ఉనికిలో ఉంది. దీనికి కచ్చితమైన రోగ నిర్ధారణ లేదు. కానీ, మాకు ఈ చికిత్సలో చాలా అనుభవం ఉంది. ప్రారంభ దశలోనే చికిత్సను అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు." అని శ్వాసకోస విభాగం డైరెక్టర్ పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష..
మరోవైపు చైనాలో నమోదవుతున్న న్యుమోనియా కేసుల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. అయితే చైనాలో తలెత్తిన పరిస్థితి భారత్‌లో వస్తే ఎదుర్కొనే సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు.. ప్రజారోగ్యం, ఆసుపత్రుల్లో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని సూచించింది. అన్ని ఆసుపత్రుల్లో కొవిడ్‌-19 నిఘా ప్రణాళిక నిబంధనలు అమలుచేయాలని ఆదేశించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోస సమస్యలను.. జిల్లాలు, రాష్ట్రాల వారీగా నిశితంగా పర్యవేక్షించాలని కేంద్రం ఆదేశించింది. శ్వాసకోస సమస్యలు సహజంగా ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, సార్స్​కోవ్​-2 వల్లే వస్తాయని.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

మరో ప్రాణాంతక జబ్బుతో చైనా గజగజ- ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్

చైనా న్యుమోనియా కేసులతో భారత్ అలర్ట్- కేంద్రం కీలక ప్రకటన​

Last Updated : Nov 26, 2023, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.