ETV Bharat / international

పాక్​ ప్రధాని అభ్యర్థిగా షరీఫ్​ నామినేషన్​.. ఇమ్రాన్​ ఇంట అర్ధరాత్రి హైడ్రామా! - ఇమ్రాన్​ ఖాన్ న్యూస్​

Pakistan News: పాకిస్థాన్​ నూతన ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌ షరీఫ్‌ నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష పార్టీ సభ్యుల మద్దతుతో పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. మరోవైపు.. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని చివరి వరకు విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ సంక్షోభాన్ని అణచివేసేందుకు ఏకంగా కొత్త ఆర్మీ చీఫ్‌ను నియమించేందుకు ఇమ్రాన్‌ ప్రయత్నించినట్లు పాక్‌ మీడియా కథనాలు ప్రచురించాయి.

Pakistan News
pakistan national assembly latest news
author img

By

Published : Apr 10, 2022, 5:40 PM IST

Pakistan News: పాకిస్థాన్​లోని ఇమ్రాన్‌ ఖాన్​ ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి కుప్పకూలింది. అందరూ ఊహించినట్లు గానే ఇమ్రాన్‌ తన పదవి నుంచి వైదొలిగారు. అయితే, రాజీనామాకు ముందు పాక్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు పాక్‌ మీడియా కథనాలు ప్రచురించాయి. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాను తొలగించేందుకు ఇమ్రాన్‌ విఫలయత్నం చేసినట్లు పేర్కొన్నాయి. తనకు విధేయుడు, అనుకూలమైన వ్యక్తిని.. సైన్యాధిపతిగా నిలబెట్టేందుకు ఇమ్రాన్‌ యత్నించినట్లు పాకిస్థాన్‌ మీడియా వెల్లడించింది. ఇందుకోసం ఇద్దరు పాక్‌ ఉన్నతాధికారులు ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి ప్రధాని ఇంటికి వెళ్లినట్లు బీబీసీ ఉర్దూ కథనం ప్రచురించింది. వీరితో 45 నిమిషాల పాటు ఇమ్రాన్ చర్చించినట్లు సమాచారం. అయితే హెలికాప్టర్‌లో వచ్చిన అధికారులు తన అంచనాలకు విరుద్ధంగా ఉండటం వల్ల అందులో ఒకరిని ఏకంగా తొలగించేందుకు ఇమ్రాన్‌ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. అటు నూతన ఆర్మీ చీఫ్‌ నియామకానికి రక్షణ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడం వల్ల ఇమ్రాన్‌ యత్నాలు సఫలీకృతం కాలేదని పాక్‌ మీడియా తెలిపింది.

అర్ధరాత్రి వేళ ఇమ్రాన్‌ను కలిసిన ఉన్నతాధికారుల్లో ఒకరిని.. ఆర్మీచీఫ్‌గా నియమించటం ద్వారా పాక్‌లోని రాజకీయ అనిశ్చితిని అణచివేయాలని ఇమ్రాన్‌ భావించినట్లు తెలుస్తోంది. తద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలని.. ఇమ్రాన్‌ చూసినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. అయితే అవన్నీ ఫలించకపోవడం వల్ల ఇమ్రాన్‌ రాజీనామా చేయక తప్పలేదని కథనాలు ప్రచురించాయి. అర్ధరాత్రి ప్రధాని ఇమ్రాన్‌ను ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాతో పాటు ఐఎస్ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీమ్‌ అహ్మద్‌ అంజూమ్‌ కలిసి ఉండొచ్చని అంచనా వేసింది. మరోవైపు బజ్వాను పదవి నుంచి తొలగిస్తే న్యాయపరంగా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ బజ్వాను తొలగించినట్లైతే దాన్ని ఇస్లామాబాద్‌ హైకోర్టులో సవాలు చేసేందుకు న్యాయవాది అద్నన్‌ ఇక్బాల్‌ పిటిషన్‌ను సిద్ధం చేసినట్లు పాక్‌లోని ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ వార్త సంస్థ పేర్కొంది. ఆర్మీ చీఫ్‌ను తొలగించేందుకు యత్నించారన్న పాక్‌ మీడయా కథనాలను ఇమ్రాన్‌ఖాన్‌ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

ప్రధాని పదవికి షరీఫ్​ నామినేషన్​: మరోవైపు పాకిస్థాన్​ నూతన ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌ షరీఫ్‌ను ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. దీంతో ఆయన పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి రాజ్యాంగ రక్షణ కోసం నిలబడిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ షెహబాజ్‌ ట్వీట్‌చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పీటీఐ తరఫున.. మాజీ విదేశాంగశాఖ మంత్రి షా ఖురేషీ కూడా ప్రధాని అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

ఇమ్రాన్ పార్టీ సభ్యుల రాజీనామాలు: జాతీయ అసెంబ్లీలో మూకుమ్మడి రాజీనామాలు సమర్పించాలని పీటీఐ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించినున్నట్లు ఆ పార్టీ నేత ఫవాద్ చౌదరి తెలిపారు. తమ సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని దేశ ప్రజలే కాపాడుకుంటారన్నారు పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్​ ఖాన్​.

"పాకిస్థాన్ 1947లో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. కానీ పాలన మార్పు, విదేశీ కుట్రకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం ఈరోజు మళ్లీ ప్రారంభమవుతుంది. దేశ ప్రజలే.. తమ సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు."

- ఇమ్రాన్​ ఖాన్​, పీటీఐ అధ్యక్షుడు

ఇమ్రాన్​ సన్నిహితుడి ఇంటిపై దాడి: పాకిస్థాన్​ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్​ను తొలగించిన గంటల్లోనే.. ఆయన సన్నిహితుడి ఇంటిపై వివిధ దర్యాప్తు సంస్థలు దాడి చేశాయి. ఇమ్రాన్ ​ఖాన్​ డిజిటల్​ మీడియా బృందంలో పనిచేసిన అర్సలాన్​ ఖలీద్​ ఇంటిపై దాడి చేసిన అధికారులు.. వారి కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను జప్తు చేశారు. ఈ విషయాన్ని పీటీఐ పార్టీ ట్విట్టర్​లో తెలిపింది. దీనిపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరపాలని డిమాండ్​ చేసింది.

ఇదీ చదవండి: ఇమ్రాన్​ క్లీన్​బౌల్డ్​.. పాకిస్థాన్​లో కుప్పకూలిన సర్కార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.