ETV Bharat / international

వామ్మో.. ఈ వజ్రం ధర రూ.412 కోట్లా..!! - second pink star diamond in world

గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ అరుదైన వజ్రం హాంకాంగ్‌లో జరిగిన వేలంలో రూ.412 కోట్ల (49.9 మిలియన్‌ డాలర్లు) ధర పలికింది.

Williamson Pink Star diamond
pink diamond
author img

By

Published : Oct 8, 2022, 7:20 AM IST

గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ అరుదైన వజ్రం శుక్రవారం హాంకాంగ్‌లో జరిగిన వేలంలో రూ.412 కోట్ల (49.9 మిలియన్‌ డాలర్లు) ధర పలికింది. క్యారెట్‌ పరంగా వేలంలో ఈ స్థాయి అత్యధిక ధర పలకడం ప్రపంచ రికార్డు. 11.15 క్యారెట్ల ఈ 'విలియమ్సన్‌ పింక్‌ స్టార్‌ డైమండ్‌' అంచనా ధర రూ.173.5 కోట్లు (21 మిలియన్‌ డాలర్లు) కాగా, రెట్టింపు ధరను మించి పలికింది. ప్రముఖ సంస్థ 'సదబీస్‌' దీన్ని వేలం వేసింది.

రెండు ప్రపంచ ప్రఖ్యాత పింక్‌ వజ్రాల వరుసలో ఈ వజ్రానికి 'విలియమ్సన్‌ పింక్‌ స్టార్‌ డైమండ్‌' అనే పేరు వచ్చింది. 23.60 క్యారెట్ల మొదటి విలియమ్సన్‌ డైమండ్‌ను తన వివాహ వేడుకలో (1947) బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కానుకగా అందుకొన్నారు. 59.60 క్యారెట్ల రెండో పింక్‌ స్టార్‌ డైమండ్‌ 2017 వేలంలో రూ.588 కోట్ల (71.2 మిలియన్‌ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది.

ఇదీ చదవండి: మానవ హక్కుల పోరాట యోధులకు నోబెల్ శాంతి పురస్కారం

ఫ్రెంచ్ రచయిత్రికి సాహిత్య నోబెల్.. 17వ మహిళగా రికార్డు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.