Imran Khan Disqualification : సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో ఐదేళ్లపాటు పోటీ చేయకుండా.. ఆ పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఆయనపై అనర్హత వేటు వేసింది. తోషాఖానా కేసులో న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించడం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ఎన్నికల సంఘం పేర్కొంది. కొన్ని నెలల్లోనే పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనుండగా.. ఈసీ నిర్ణయంతో ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పాకిస్థాన్ పార్లమెంటు గడువు ఆగస్టు 12 వరకు ఉండగా.. ఆగస్టు 9న దిగువ సభ రద్దుకు సిఫార్సు చేస్తానని ఇప్పటికే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. మరోవైపు, ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండానే ట్రయల్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారని.. ఇమ్రాన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన న్యాయవాది ఆలస్యంగా వచ్చారనే నెపంతో.. జడ్జి వాదనలను వినడానికి నిరాకరించారని తెలిపారు.
ఇదీ తోషఖానా కేసు..
Toshakhana Case Imran : గతేడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన్ను కేసులు చుట్టుముట్టాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయనకు విదేశీ పర్యటనల్లో పలు బహుమతులు వచ్చాయి. వాటిని ఇమ్రాన్ విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌పై కేసు నమోదైంది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషఖానాలో జమ చేయాలి. ఇక వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి తీసుకోవాలి.
Toshakhana Case Explained : కానీ, ఇందులో రూ.38 లక్షల రొలెక్స్ గడియారాన్ని ఇమ్రాన్.. కేవలం రూ.7.54 లక్షలు చెల్లించి సొంతం చేసుకొన్నారు. రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్ గడియారానికి రూ.2.94 లక్షలు మాత్రమే చెల్లించి తీసుకున్నారు. ఇలా మూడోవంతు కంటే తక్కువగా కట్టి, పలు కానుకలను ఇంటికి చేర్చుకొన్న ఇమ్రాన్.. రూ.8 లక్షల కానుకలను ఒక్క రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకొన్నారని.. ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకొన్నారని మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష.. లండన్ ప్లాన్‌లో భాగమన్న పాక్ మాజీ ప్రధాని