ETV Bharat / international

కరోనా కొత్త వేరియంట్​ భయాలు.. బీఏ.4.6 తీవ్రత ఎంత? వ్యాక్సిన్లు పనిచేయవా? - అమెరికాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

Omicron New Sub Variant BA 4 6: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకొని మనుగడ సాగిస్తోంది. బ్రిటన్‌, అమెరికా సహా పలు దేశాల్లో ఒమిక్రాన్‌కు సబ్‌వేరియంట్‌ అయిన బీఏ 4.6 వ్యాప్తిలో ఉన్నట్లు తేలింది. మరి దీని తీవ్రత ఎంత? ఎంత వేగంగా వ్యాపిస్తుంది? రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉందా? కొత్త వేవ్‌కు ఇది కారణమవుతుందా? నిపుణులు ఏమంటున్నారు ఈ కథనంలో చూద్దాం.

Omicron sub variant
ఒమిక్రాన్
author img

By

Published : Sep 15, 2022, 2:02 PM IST

Omicron New Sub Variant BA 4 6: ఒమిక్రాన్‌కు సబ్‌ వేరియంట్‌ అయిన బీఏ.4.6 వేరియంట్‌ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల అమెరికాలో ఈ వేరియంట్‌ కేసులు ఎక్కువ కాగా.. బ్రిటన్‌లో కూడా ఇది ప్రభావం చూపుతోంది. యూకేలో ఆగస్టు నెలలో పరీక్షించిన కొవిడ్‌ నమూనాల్లో 3.3 శాతం ఈ వేరియంట్‌వే ఉన్నాయని బ్రిటన్‌ ఆరోగ్య భద్రతా ఏజెన్సీ వెల్లడించింది. ఇక అమెరికాలోనూ బీఏ.4.6 వేరియంట్‌ విస్తృత వ్యాప్తిలో ఉన్నట్లు వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం వెల్లడించింది. అక్కడ సీక్వెన్సింగ్‌ చేపట్టిన కేసుల్లో 9శాతానికి పైగా ఈ కొత్త వేరియంట్‌వే ఉన్నట్లు తెలిపింది. అమెరికా, బ్రిటన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ వేరియంట్‌ ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు సీడీసీ పేర్కొంది.

ఒమిక్రాన్‌ బీఏ.4 కు చెందిన ఉపరకమే బీఏ.4.6. ఈ ఏడాది జనవరిలో బీఏ.4ను దక్షిణాఫ్రికాలో మొదటగా గుర్తించారు. అప్పటి నుంచి ఈ వేరియంట్‌తోపాటు బీఏ.5 కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యాప్తిలో ఉన్నాయి. బీఏ.4.6 వేరియంట్‌ కచ్చితంగా ఎలా ఉద్భవించిందనే విషయంపై స్పష్టత లేదు. కొన్ని వేరియంట్ల కలయిక వల్ల ఈ కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. ఒకేవ్యక్తికి, ఒకేసారి రెండు కరోనా వైరస్‌ రకాలు సోకినట్లయితే దాన్ని రీకాంబినెంట్‌గా పరిగణిస్తున్నారు.

తీవ్రత తక్కువే!
ఆర్​346టీ మ్యుటేషన్‌కి చెందిన ఈ రకం కరోనా వైరస్‌లు చాలా దేశాల్లో ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నాయి. బీఏ.4.6 వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరణాలు కూడా స్పల్పంగానే ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం అధిక ప్రాబల్యం కలిగిన బీఏ.5 వేరియంట్‌కు రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే గుణం ఉన్నట్లు నిపుణులు ఇప్పటికే గుర్తించారు. తాజాగా బయటపడిన బీఏ.4.6కు రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యం మరింత ఎక్కువ ఉందని ప్రాథమిక అధ్యయనాల్లో తేలినట్లు తెలుస్తోంది. కొత్త వేరియంట్లను చూస్తుంటే కరోనా వైరస్‌ ఇంకా మన మధ్యే ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ వల్ల పూర్తి రక్షణ ఉంటుందని సూచిస్తున్నారు.

కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నా తీవ్ర అనారోగ్యం బారినపడకుండా వ్యాక్సినేషన్‌ అడ్డుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌పై పోరులో టీకానే ప్రధాన ఆయుధంగా పేర్కొంటున్నారు. బైవేలెంట్‌ బూస్టర్లు అందుబాటులోకి రావడం శుభపరిణామమని చెబుతున్నారు. బహుళ వేరియంట్లను ఎదుర్కొనే మల్టీవేరియంట్‌ కొవిడ్‌ టీకాల అభివృద్ధి మరింత ఉపకరిస్తుందని తెలిపారు. మరోవైపు బీఏ.4.6 వేరియంట్‌ కొత్త వేవ్‌కు కారణమవుతుందా అనే దానిపై నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.