ETV Bharat / international

టైట్​ జీన్స్​, జుట్టుకు రంగులు వేస్తే అంతే! చుక్కలు చూపిస్తున్న కిమ్!! - kim jong un news

North Korea Rules: విదేశీ సంస్కృతి అరికట్టేలా కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది ఉత్తరకొరియా. 30 ఏళ్లలోపు మహిళల్ని లక్ష్యంగా చేసుకుని టైట్​ జీన్స్​, జుట్టుకు రంగులు వేయడం, అసభ్యకర రాతల బట్టలు ధరించడం వంటి వాటిని కఠినంగా అణచివేస్తోంది. మరోవైపు ఉత్తరకొరియా అణు నిరాయుధీకర చర్యలు ప్రారంభిస్తే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానన్నారు దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు యున్ సుక్ యోల్.

north korea rules and regulations
north korea rules and regulations
author img

By

Published : May 10, 2022, 12:43 PM IST

North Korea Rules: పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా కఠిన ఆంక్షలను విధించింది ఉత్తర కొరియా. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య గల మహిళలను లక్ష్యంగా చేసుకుని నిబంధనల్ని అమలు చేస్తోందని మీడియా వర్గాలు తెలిపాయి. టైట్​ జీన్స్​, జుట్టుకు రంగులు, అసభ్యకర రాతలు గల బట్టలు ధరించడం లాంటి వాటిని కఠినంగా అణచివేస్తుంది. ఇలాంటి వేషధారణతో రోడ్లపై కనిపిస్తే పెట్రోలింగ్​ అధికారులు పోలీస్​ స్టేషన్​కు తరలిస్తున్నారు. అనంతరం నేరాన్ని ఒప్పుకుని.. తిరిగి అలాంటి దుస్తులు ధరించమని హామీ ఇచ్చిన తర్వాతే వారిని విడుదల చేస్తున్నారు.

గత మేలోనే ఉత్తర కొరియా జీన్స్​, హెయిర్​ స్టైల్స్​ను నిషేధించింది. ఈ విదేశీ అలంకరణను 'ప్రమాదకరమైన విషం'గా అభివర్ణించారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్​ ఉన్‌. ఆయన ప్రకటన అనంతరం ఈ ఆంక్షల అమలుపై అధికారులు మరింత శ్రద్ధపెట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యాత్​ లీగ్​ వీటిని ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు సమావేశాలను నిర్వహిస్తోంది. అత్యంత తీవ్రమైన సందర్భాల్లో నిబంధనల్ని ఉల్లంఘించినవారి పేరు, చిరునామాను లౌడ్​స్పీకర్లలో ప్రచారం చేస్తామని యూత్​లీగ్​ సభ్యులు తెలిపారు. ఇన్ని నిబంధనలు విధించినా యువత విదేశీ సినిమాలు, దుస్తులు ధరించడంలో మార్పు రావడం లేదని పేర్కొన్నారు.

అణు నిరాయుధీకరణ మొదలుపెడితే సాయం చేస్తాం: మరోవైపు.. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చర్యలు ప్రారంభిస్తే.. ఆ దేశ అర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషిచేస్తామన్నారు దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు యున్ సుక్ యోల్. మంగళవారం కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పార్లమెంట్​ ఆవరణలో మాట్లాడారు. ఉత్తర కొరియా సమస్యను చర్చలతో పరిష్కరించుకోవడానికి సిద్ధమన్నారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చేస్తే ప్రోత్సాహకాలను అందిస్తామని దక్షిణ కొరియా నాయకులు గతంలోను ప్రకటించారు. కానీ కిమ్‌ జోంగ్​ ఉన్‌ ప్రభుత్వం వాటిని తిరస్కరించింది.

"ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలతో మాతో పాటు ఈశాన్య ఆసియాకు ముప్పు ఉంటుంది. శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మేము ఎలప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఉత్తర కొరియా నిజంగా అణు నిరాయుధీకరణ ప్రక్రియను ప్రారంభిస్తే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహాయం అందిస్తాం."

- యున్ సుక్ యోల్, దక్షిణ కొరియా అధ్యక్షుడు

ఇదీ చదవండి: తాలిబన్ల కిరాతకానికి బలైన భారతీయ ఫొటో జర్నలిస్టుకు 'పులిట్జర్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.