ETV Bharat / international

మానవ హక్కుల పోరాట యోధులకు నోబెల్ శాంతి పురస్కారం - నోబెల్ గ్రహీతలకు రివార్డు

Nobel Peace Prize 2022 : నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది.. మానవ హక్కుల కోసం పోరాడిన ఓ వ్యక్తికి, మరో రెండు సంస్థలకు వరించింది. రష్యాకు చెందిన 'మెమోరియల్'​ అనే సంస్థకు, ఉక్రెయిన్​కు చెందిన 'సెంటర్ ఫర్ సివిల్ సివిల్ లిబర్టీస్' అనే సంస్థకు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం లభించింది.

nobel peace prize 2022 announced
నోబెల్ శాంతి పురస్కారం
author img

By

Published : Oct 7, 2022, 2:39 PM IST

Updated : Oct 7, 2022, 3:41 PM IST

Nobel Peace Prize 2022 : 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్​ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది నోబెల్ కమిటీ. మానవ హక్కుల కోసం ఉద్యమించిన వ్యక్తికి, సంస్థలకు కలిపి ఇస్తున్నట్లు తెలిపింది. బెలారస్​కు చెందిన అలెస్​ బియాలియాట్స్కీ, రష్యన్​ మానవ హక్కుల సంస్థ అయిన 'మెమోరియల్', ఉక్రెయిన్​ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ అయిన 'సెంటర్​ ఫర్ సివిల్ లిబర్టీస్​'కు ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ అవార్డును నార్వేయన్ నోబెల్ కమిటీ అధ్యక్షుడు బెరిట్ రీస్ ఆండర్సన్ ప్రకటించారు.

బెలారస్​కు చెందిన అలెస్​ బియాలియాట్స్కీ.. మానవ హక్కుల కోసం పోరాడుతున్నందుకుగానూ నోబెల్ శాంతి పురస్కారం వరించింది. అలాగే 1987లో మానవ హక్కుల కార్యకర్తలు రష్యాలో 'మెమోరియల్' సంస్థను స్థాపించారు. మరోవైపు, ఉక్రెయిన్​కు చెందిన సెంటర్ ఫర్ లిబర్టీస్ సంస్థను.. మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్దేశంతో నెలకొల్పారు.

nobel peace prize 2022
నోబెల్ శాంతి బహుమతి విజేతలు

నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు వారి స్వదేశాల్లో పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తున్నారు. అలాగే ఉక్రెయిన్, రష్యాకు చెందిన సంస్థలు మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. సమాజంలో శాంతి, ప్రజాస్వామ్యం కోసం ఆ సంస్థలు పోరాడుతున్నాయి.

--నోబెల్ కమిటీ

ఇప్పటికే వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్య రంగంలో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. స్వీడన్​కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్​కు ఎంపిక చేశారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్​'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. రసాయనశాస్త్రంలో నోబెల్ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. సాహిత్య రంగంలో ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్ నోబెల్ అవార్డును దక్కించుకున్నారు. అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు.

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్‌ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.

ఇవీ చదవండి: ఫ్రెంచ్ రచయిత్రికి సాహిత్య నోబెల్.. 17వ మహిళగా రికార్డు..

ముగ్గురు శాస్త్రవేత్తలను వరించిన రసాయనశాస్త్ర నోబెల్.. ఆయనకు రెండోసారి

Last Updated : Oct 7, 2022, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.