ETV Bharat / international

నైజీరియాలో వర్షాల బీభత్సం.. వరదల ధాటికి 600 మంది బలి - నైజీరియా లేటెస్ట్ న్యూస్

Nigeria Floods : నైజీరియాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భీకర వరదల కారణంగా నైజీరియాలో 600 మందికి పైగా ప్రజలు మరణించారని అధికారులు తెలిపారు. మరో 13లక్షల మంది నిరాశ్రయులుగా మారారని పేర్కొన్నారు.

Nigeria floods
నైజీరియాలో వరదలు
author img

By

Published : Oct 18, 2022, 6:49 AM IST

Updated : Oct 18, 2022, 6:57 AM IST

Nigeria Floods : ఆఫ్రికా దేశం నైజీరియాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఆ దేశం జలమయమైపోయింది. దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో వరదలు ఎప్పుడూ రాలేదని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. భీకర వరదల కారణంగా 600మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇళ్లు కొట్టుకుపోవడం, నీటమునిగిపోవడం వల్ల దాదాపు 13లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. అయితే, రాష్ట్రాల్లో అనేక హెచ్చరికలు చేసినప్పటికీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు పూర్తిగా సిద్ధం కాలేదని.. అందుకే ప్రాణ నష్టం భారీ స్థాయిలో ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

నైజీరియా మానవతా వ్యవహారాలు, విపత్తు నిర్వహణ మంత్రి సదియా ఉమర్ ఫరూక్ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ భారీ విపత్తులో ఇప్పటివరకు దాదాపు 2లక్షల ఇళ్లు కొట్టుకుపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా నవంబర్‌ చివరి వరకు కూడా అక్కడ వర్షాలు, వరదలు కొనసాగే అవకాశం ఉంది.

ఇవీ చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట.. ఏడు స్థానాల్లో పోటీ.. ఆరుచోట్ల గెలుపు

చీప్ వెపన్స్​తో రష్యా దాడులు.. ఇరాన్ మోపెడ్​లతో కీవ్​లో విధ్వంసం

Last Updated : Oct 18, 2022, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.